Sunday, December 28, 2008

Paddenimidi Metlu ... From the album Swami Saranamide - By R.P. Patnaik

ఓం స్వామియే శరణం అయ్యప్ప
పదునెట్టాంబడియ్యే శరణం అయ్యప్ప
పదు నెట్టాం బడి అధిపతియే శరణం అయ్యప్ప

పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లు " ౨ "
మొక్కిన చెరగును చీకట్లు
ఎక్కిన తొలగును ఇక్కట్లు
ఇహానికి పరానికి వేసిన వంతెన ఈ మెట్లు " పద్దెనిమిది"

ఒకటో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
నమ్మితి నేనయ్యప్ప దేవుడు ఒకడే నంటు ఆ ఒకడివి నీవేనంటూ
రెండవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
కొలిచితి నేనయ్యప్ప జ్ఞానం నీదే నంటూ అజ్ఞానిని నేనే అంటూ
మూడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
మొక్కితి నేనయ్యప్ప త్రిలోక నేతవు నీవని త్రికాల జ్ఞానివి నీవని
" పద్దెనిమిది "

నాల్గవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పలికితి నేనయ్యప్ప చతుర్వేదములు నీవనీ చతురాననుడే నీవని
ఐదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
అంటిని నేనయ్యప్ప పంచ భూతములు నీవని పంచామ్రుతమే నీవనీ
ఆరవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
అడిగితి నేనయ్యప్ప అరిషడ్వర్గము నాదని నరికే ఖడ్గం నీవని
" పద్దెనిమిది "

ఎదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
వేడితి నేనయ్యప్ప ఏడు లోకాలు నీవని ఏలే దైవం నీవని
ఎనిమిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
ఎరిగితి నేనయ్యప్ప అష్ట దిశలలో నీవని అష్ట సిద్దులు నీవని
తొమ్మిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
తోచెను నాకయ్యప్ప నవరస మూర్తివి నీవని నవ చైతన్యం నీదని
" పద్దెనిమిది "

పదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పాడితి నేనయ్యప్ప దశావతారాలు నీవని మా దశలకు కారకుడవే అని
పదకొండవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
ప్రనవిల్లితి నేనయ్యప్ప పార్వతి సుతుడే నీవనీ పరమ పావనుడు నీవనీ
పన్నెండవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పలికితి నేనయ్యప్ప గ్రహరాసులలో నీవనీ నీ అనుగ్రహము ఇక మాదని
" పద్దెనిమిది "

పదమూడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పిలిచితి నేనయ్యప్ప పదములు పాడితి అయ్యప్ప నీ పాదములు మొక్కితి అయ్యప్ప
పదునాల్గవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
భక్తి తోడ నేనయ్యప్ప భగవతి సుతుదన్తయ్యప్ప భగవంతుడివె అయ్యప్ప
పదిహేనవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పాప వినాశక అయ్యప్ప కాల గమనమే నీవప్పా లోకాల తనయుడే అయ్యప్ప
"పద్దెనిమిది "

పదహారవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పాడితి నేనయ్యప్ప సోదశ కలలే అయ్యప్ప చంద్ర కలాధర సుత అయ్యప్ప
పదిహేడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పలికితి నేనయ్యప్ప మా తప్పోప్పులనే అయ్యప్ప మన్నిన్చవయా అయ్యప్ప
పద్దెనిమిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
మొకరిల్లితిని అయ్యప్ప అష్టాదశ మూర్తివి అయ్యప్ప అన్నదాత ప్రభువయ్యప్ప
" పద్దెనిమిది "

Ayyappa Padi Paata Lyrics and Listen the Song

స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప
హరి హర సుతనే శరణం పొన్నయ్యప్ప "౨"

ఎరుమేలి శాస్త శరణం పొన్నయ్యప్ప
పేట్టైతుళ్ళి శరణం పొన్నయ్యప్ప

వావరు స్వామియే శరణం పొన్నయ్యప్ప
కాలైకట్టి ఆశ్రమమే శరణం పొన్నయ్యప్ప

అలుద నదియె శరణం పొన్నయ్యప్ప
అలుదై స్నానమే శరణం పొన్నయ్యప్ప

కరిమల తోడే శరణం పొన్నయ్యప్ప
కరిమల ఎట్రమే శరణం పొన్నయ్యప్ప

కరిమల గర్భ స్వామి శరణం పొన్నయ్యప్ప
పంబా నదియె శరణం పొన్నయ్యప్ప

పంబై స్నానమే శరణం పొన్నయ్యప్ప
నీలి మలై ఎట్రమే శరణం పొన్నయ్యప్ప

అప్పాచ్చి మేడే శరణం పొన్నయ్యప్ప
కాంతి మలై జ్యోతియే శరణం పొన్నయ్యప్ప

శబరి పీ త మే శరణం పొన్నయ్యప్ప
శబరికి ముక్తి శరణం పొన్నయ్యప్ప

అగ్ని గుండమే శరణం పొన్నయ్యప్ప
మకర జ్యోతియే శరణం పొన్నయ్యప్ప

స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప
హరి హర సుతనే శరణం పొన్నయ్యప్ప
"౨"

స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప

ఒకటవ మెట్టు శరణం పొన్నయ్యప్ప

రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప

మూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప

స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప

నాల్గవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
ఐదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
ఆరవ మెట్టు శరణం పొన్నయ్యప్ప

స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప

సశేషం....


Listen this song here.

Ayyappa Swamiki Arati Mandapam - Lyrics

స్వామియే ... శరణం
స్వామియే ... శరణం
అయ్యప్ప స్వామికి అరటి మండపం
కొబ్బరి మువ్వల పచ్చ తోరణం
స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"

హరి హర తనయుడు అందరి దేవుడు
నీల కంటునికి ప్రియ సుతుడితడు
స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"

కరిమల వాసుడు కార్తికేయుడు
జాతి భేదములు తెలియని వాడు
స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"

పంబా వాసుడు పందళ బాలుడు
ఐదు కొండలకు అధిపతి అతడు
స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"

శబరి గిరీషుడు శంకర తనయుడు
జ్యోతి స్వరూపుడు భూలోక నాథుడు
స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"

Friday, December 12, 2008

Nee Naama Smarana Leka Saranam Ayyappa

నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "

ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "

అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"

కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "

చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "

సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "

Kobbari Kaayalu Ayyappake - Koti Poojalu Ayyappake

కొబ్బరి కాయలు అయ్యప్పకే అయ్యప్పకే
కోటిపూజలు అయ్యప్పకే అయ్యప్పకే " కొబ్బరి "
శబరి మలై నా అయ్యప్పో అయ్యప్ప
ఎరుమేలి కాడ అయ్యప్పో అయ్యప్ప "కొబ్బరి "
ఇరుముడి నెత్తుకొని అయ్యప్పో అయ్యప్ప
మేము నీ కొండ కోత్తమయ్య అయ్యప్పో అయ్యప్ప "కొబ్బరి "
కరిమల వాసా అయ్యప్పో అయ్యప్ప
మా కష్టాలు తీర్చ రావా అయ్యప్పో అయ్యప్ప "కొబ్బరి"
పంబ నదిలో అయ్యప్పో అయ్యప్ప
మేము తానాలు సేత్తమయ్య అయ్యప్పో అయ్యప్ప " కొబ్బరి "
కరుణా మూర్తి అయ్యప్పో అయ్యప్పా
మమ్ము కరుణించ రావా అయ్యప్పో అయ్యప్ప " కొబ్బరి "

Ayya Darshanam - Swamy Ayya Darshanam

అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
బంగారు కొండ మీద అయ్యా దర్శనం " ౨ "

రాయి రాప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో
అలసి ఉల్లాసంగా నీకై మేమే వస్తున్నామయ్య " ౨ "
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప "౨ " " అయ్యా"

దివ్యమైన నీ వ్రతముతో మాల వేసి
మొక్కుబడి మూట లెత్తి వస్తున్నామయ్యా " ౨ "
పంబ లోన స్నానం చేసి పాపాలు వదిలి
సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా " ౨ "

ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము
నీ చేయి చాచి కరిమల నీలిమల ఎక్కిన్చాలయ్యా " ౨ "
స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా " ౨ " " అయ్యా "

Tuesday, December 2, 2008

పల్లికట్టు - Pelliket



I like this video song very much. Even I didn't understood its meaning I got the gist of this song. Really its very nice song. I really thank to Veeramani.

Monday, December 1, 2008

Dosita Gulaabi Poovulato

దోసిట గులాబి పూవులతో - నీ వాకిట నిలబడి ఉన్నామురా

లోనికి ఏల రమ్మనవో - నీ దీవెన లేల అందించవో

కొండంత దేవుడవు ... నీకు కొండంత కానుక తేగలమా


ఒంటరి వాడవు నీవని నే జంటగా నీతో ఉండాలని

కొండంత ఆశతో నే రాగా నిరాశ పాలే చేయుదువా


ఎంతటి మెత్తని హృదయం నీది ఇంతటి కాటిన్యమేలరా

ఎన్నెన్ని యుగాలు గడిచాయో ఇంకెన్ని యుగాలు గడవాలో

Friday, November 28, 2008

Satyamu Jyotiga Velugunayaa... Ayyappa

Makara Jyothi
సత్యము జ్యోతిగ వెలుగునయా
నిత్యము దానిని చూడుమయా
పరుగున మీరు రారయ్యా
శబరి గిరికి పోవుదము


శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరీశా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురు స్వామియే శరణం అయ్యప్ప


హరిహర మానస సుతుడైన
సురల మొరలను ఆలించి
భువిలో తాను జనియించి
పడునాల్గేండ్లు వసియించి

Sabarimala Makara Jyothi
ఘోరా తడవిలో బాలునిగా
సర్పము నీడలో పవళించి
వేటకు వచ్చిన రాజునకు
పసి బాలునిగా కనిపించి


మనికంట అను
నామముతో
పెంచిరి బాలుని మురిపెముగా
స్వామి మీ మహిమలతో
రాజుకు కలిగెను సుతుడొకడు
Ayyappa

గురువాసంలో చదివించి
గురు పుత్రున్ని దీవించి
మాటలు రాని బాలునకు
మాటలు వచ్చెను మహిమలతో

మాతా పితలను సేవించి

మహిషి ని తాను వధియించి

శబరి గిరిలో వేలిసిరి గా మనలను ధన్యుల జేయుటకు

అయ్యప్పా అను నామముతో

శిలా రూపమున తానున్నా

జ్యోతి స్వరూపా మహిమలతో

భక్తుల కోర్కెలు దీర్తురయా

మార్గశిరాన మొదలెట్టి

నలుబది దినముల దీక్షతో

శరణుని భజనలు చేయుచునూ

ఇరుముడి కట్టి పయనించి

భోగికి ముందు చేరాలి

మకర సంక్రాంతి చూడాలి

చాలు చాలు మనకింకాAyyappa

వలదు వలది ఇక జన్మ

మకర సంక్రాంతి దినమున

సాయం సమయం వేళలో

సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతిగా దర్శన మిచ్చేదరు


పాలాభిషేకం స్వామీకి

నేయ్యాభిషేకం స్వామీకి

తేనాభిషేకం స్వామీకి

పూలాభిషేకం స్వామీకి

కర్పూర హారతి తనకెంతో

పాయసమంటే మరి ఎంతో

శరణన్న పదము ఎంతెంతో
ఇష్టం ఇష్టం స్వామికి

హరివరాసనం స్వామీది
సుందర రూపం స్వామీది
కనుల పండుగ మనకేలే
జన్మ తరించుట మనదేలే

శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం శరణ మయా
శరణం శరణం మా స్వామి
నీ దరికి జేర్చుకో మా స్వామి

Wednesday, November 19, 2008

శరణం గణేశా శరణం గణేశా

శరణం గణేశా శరణం గణేశా
గణేశ శరణం శరణం గణేశా
గజ ముఖ వదనా శరణం గణేశా
పార్వతి పుత్రా శరణం గణేశా " శరణం "
మూషిక వాహన శరణం గణేశా
మోదక హస్తా శరణం గణేశా " శరణం "
శంభు కుమారా శరణం గణేశా
శక్తీసుపుత్రా శరణం గణేశా " శరణం "
షణ్ముఖ సోదర శరణం గణేశా
సంకట నాశన శరణం గణేశా " శరణం "
సిద్ధి వినాయక శరణం గణేశా
బుద్ధి వినాయక శరణం గణేశా " శరణం "
ఓంకార గణపతి శరణం గణేశా
కన్నె మూల గణపతి శరణం గణేశా " శరణం "

Saranam Saranamayaa... Ayyappa... Swami

మా జగిత్యాల శ్రీ ధర్మశాస్త ఆలయ పూజారి శ్రీ లక్ష్మి పతి గురు స్వామి గారి దివ్య ఆశీస్సులతో ...

శరణం శరణమయా స్వామీ

శరణం శరణమయా అయ్యప్పా

శరణం అన్నా మరణం లేదు

శబరి గిరి నిలయా ... " శరణం "

అందరి దేవుడవే స్వామి

ఆదరించు దేవుడవే అయ్యప్పా

అయ్యప్ప దేవుడవే స్వామి

అరణ్య వాసుడవే స్వామి " శరణం "

హరి హర పుత్రుడవే స్వామి

ఆనంద రూపుడవే అయ్యప్పా

మోహిని పుత్రుడవే స్వామి

మోహన రూపుడవే అయ్యప్పా " శరణం "

మహిషి మర్ధనుడా స్వామి

మదగజ వాహనుడా అయ్యప్పా

వనపులి వాహనుడా నీకు

వందనము జేసేదము అయ్యప్పా " శరణం "

గజ ముఖ సోదరుడా స్వామి

షణ్ముఖ సోదరుడా అయ్యప్పా

కారణ జన్ముడవే స్వామి

కావగా రావయ్యా అయ్యప్పా " శరణం "

కార్తీక మాసానా స్వామి

నీ మాల వేసుకుంటూ అయ్యప్పా

నలుబది దినములు స్వామి

దీక్షతో కొలిచెదము అయ్యప్పా " శరణం "

ఇరుముడి వేసుకొని స్వామి

నిన్నే తలచుకొని అయ్యప్పా

శబరి గిరి జేరి నిన్నే

దర్శించుకుంటాము అయ్యప్ప " శరణం "

పాలాభిషేకమయ్య నీకు

నేయ్యాభిశేక మయ్యా అయ్యప్పా

చేయగా చూసాము నీకు

శరణము పలికెదము అయ్యప్పా " శరణం "

తప్పులు ఎన్నెన్నో మేము

అనుదినము చేసినాము అయ్యప్పా

తండ్రి వోలె దరి జేర్చి మమ్ము

దయతో బ్రోవుమయా అయ్యప్పా " శరణం "

Thursday, November 13, 2008

జై విఘ్నేశ్వర

వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

Ammavu neevani Tallivi neevani ...

ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ "శ్రీ శ్రీనివాస్" గారి నోటి నుండి జాలు వారిన ఈ పాట ...

అమ్మవు నీవని తల్లివి నీవని నిను కొలిచేమమ్మా

అమ్మా నిను తలచేమమ్మా "౨"

ముత్యాలు వద్దు , వెండి వద్దు, పగడాలు వద్దు

కరుణేచాలమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

బంగారం వద్దు వెండి వద్దు సంపద వద్దు

దీవెన చాలమ్మా అమ్మా నీ దీవెన చాలమ్మా " అమ్మ "

గార్వాల బిడ్డవు కానే కావు గారవం అసలే చేయనే చెయ్యవు

ఆడించాలమ్మా మమ్ము ఆడించాలమ్మ " అమ్మ "

గళ్ళు గళ్ళు గజ్జేల్లో సన్న జాజి మొగ్గల్లో మల్లె మల్లె మొగ్గల్లో

నడిచి రావమ్మా అమ్మ నడిచి రావమ్మా " అమ్మ "

కుంకుమాభిషేకం చందనాభిషేకం గందాభిషేకం

అన్నీ నీకమ్మా అమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

పన్నీరాభిషేకం పాలాభిషేకం పూలాభిషేకం

అన్నీ నీ కమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

కంచి కామాక్షి మధుర మీనాక్షి శ్రీశైల భ్రమరాంభ

అన్నీ నీవమ్మా అమ్మ నీ కరుణే చాలమ్మా " అమ్మ "

ఓరుగల్లు భద్రకాళి ఓరుగల్లు సంతోషి హన్మకొండ పద్మాక్షి

అన్నీ నీవమ్మా అమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

Ayyappa Naava Paata

మా గురు స్వామి దశరధ రెడ్డి గారి దివ్య ఆశీస్సులతో ...
శబరి మలై నౌక - సాగి పోతున్నది
అయ్యప్ప నౌక - సాగి పోతున్నది
నామంబు పలికితే - నావ సాగిపోతున్నది
అందులో చుక్కాని - శ్రీ మణికంటుడు
అందులో తెరచాప - మా మణి కంటుడు
అమ్మలారా అయ్యలారా - రండి రండి మీరు
తేడ్దేయ్య పని లేదు - తెర చాప అక్కర లేదు
నీరు లేకుండానే - నావ సాగి పోతుంది
డబ్బిచ్చి మీరు - ఈ నావ ఎక్కలేరు
జ్ఞానమనే ధనము - అందించు మీకు
కష్ట సుఖములు రెండు - ఘనమైన కెరటాలు
కదలకండి బాబు - మెదలకండి బాబు

Friday, November 7, 2008

Bhagavaan Saranam - Bhagavati Saranam

భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవానే - భగవతియే
దేవనే - దేవియే
ఈశ్వరనే - ఈశ్వరియే

" భగవాన్ "
నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించేదము అయ్యప్ప
పగలు రేయి నీ నామమ్మే స్మరియించేదము అయ్యప్ప

" భగవాన్ "
కరిమల వాసా పాప వినాశా శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్ప
" భగవాన్ "
మహిషి సంహారా మద గజ వాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాసా సుందర రూపా శరణం శరణం అయ్యప్పా

" భగవాన్ "

Intha Thodarendukayya Kanne Swami

సన్నిధానానికి చేరుకోటానికి పరితపించే మా కన్నె స్వామి శివని చూస్తుంటే......

ఇంత తొందరెన్ దుకయ్య కన్నె స్వామి
కాలు నిలువ దాయే నీకు కన్నె స్వామీ
భక్తీ తో నీ మనసు కన్నె స్వామి
ఉయ్యాల లూగుతోంది కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
మేడలోన మాల ముఖ్యం తల మీద ఇరుముడి ముఖ్యం
నువ్వు శరణు ఘోష చేసుకుంటూ కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
అడుగు అడుగున రాల్లుంటాయి
దారి పొడవునా ముల్లుంటాయి
నీవు అడుగు వేస్తె చాలునయ్య కన్నె స్వామి
రాళ్ళు ముళ్ళు పూలవుతాయి కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
గురు స్వామి ని వదలబోకు శరణు ఘోష విడువ బోకు
నువ్వు గురు స్వామి దీవెన తోని కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
పంబ లోన స్నానమాడి పడునేట్టాం బడి నేక్కాలయ్య
నువ్వు సన్నిధానం చేరుకొని కన్నె స్వామి
జ్యోతినే దర్శించాలయ్య కన్నె స్వామి.
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "

Monday, November 3, 2008

Chinni Chinni Vaadive Ayyappa

మా రవీందర్ గురు స్వామి గారి ఆశీర్వచనములతో ...
చిన్ని చిన్ని వాడివే అయ్యప్పా
చిన్నారి పసి వాడివే అయ్యప్పా
కన్నా వారి ప్రేమ కాస్తైనా తెలియని పొన్నంబల రెడువే

" చిన్ని చిన్ని"
వికృత రూపంబున అయ్యప్ప భూత నాధుడ వైతివా అయ్యప్ప
లోక రక్షణ కొరకు బ్రహ్మ కార్యార్తివై బాల రూపము దాల్తివా
లాలా లెవ్వరు బోసిరి అయ్యప్ప జోల లెవ్వరు పాడిరి అయ్యప్ప
పాలు బువ్వ పెట్టి జోల పాట పాడి ఎవరు నిను జోకోట్టిరి
ఎంత ఒంటరి వాడివి అయ్యప్ప ఎన్నాళ్ళ పసి వాడివి అయ్యప్ప
ఏకాంత వాసి వై పొన్నంబల పైన ఎన్నాళ్ళు కూచుంటివి
దేవతలు నిను జూచిరి అయ్యప్ప ఆహాకారము జేసిరి అయ్యప్ప
చిన్న వాడివని గద్దేక్క రాదనీ మెట్లయ్యి ఎక్కిన్చిరి.

"చిన్ని చిన్ని "
కనులా కందని రూపము అయ్యప్ప మాట కందని రూపము
మకర సంక్రాన్తిన రెండు కన్నులు తెరిచి లోకాన్ని చూస్తుంతివా
కల లోన నిను జూచితి అయ్యప్ప కన్నీరు నే గార్చితే అయ్యప్ప
గురువులకు గురువైన బాల గురు స్వామి నీ మతము నే దాల్చితి

"చిన్ని చిన్ని "
జో జో జో జో జో జో ....

Wednesday, October 15, 2008

తూరుపు దేశం పోదామా తుమ్మి పూలు తెద్దామా

స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం శరణం అయ్యప్ప (2)
తూరుపు దేశం పోదామా తుమ్మి పూలు తెద్దామా
తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
పడమట దేశం పోదామా పండ్లు మల్లెలు తెద్దామా
తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
ఉత్తర దేశం పోదామా ఉమ్మి పూలు తెద్దామా
తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
దక్షిణ దేశం పోదామా తామర పూలు తెద్దామా
తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
కేరళ దేశం పోదామా అయ్యప స్వామిని చూద్దామా
చూచి శరనాలు చెపుదామా నేయ్యభిషేకం చేదామా ( స్వామి )

Manoharam Mahaavaram Ayyappa Swami Darsanam

మనోహరం మహావరం అయ్యప్ప దర్శనం
మరవ రాదు మరల రాదు మనకీ అవకాశం
మనోహరం

మకర సంక్రాంతి దినమున జ్యోతి దర్శన మీయగా
చూసిన కనులు పండుగ చూడని కనులు చూడగా
మనోహరం

సనాతన సారధి స్వర్గానికి వారధి
శాంతి ధర్మ ప్రియనే మనకీ ఒక పెన్నిధి
మనోహరం

Thursday, September 18, 2008

Ayyappa Harivaraasanam Lyrics

హరివరాసనం విశ్వ మోహనం
హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం
అరివి మర్దనం నిత్య నర్తనం
హరిహరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»


శరణ కీర్తనం భక్త మానసం
భరణ లోలుపం నర్తనాలసం
అరుణ భాసురం భూత నాయకం
హరిహరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»


ప్రణయ సత్యకా ప్రాణ నాయకం
ప్రనత కల్పకం సుప్ర భాంజితం
ప్రణవ మందిరం కీర్తన ప్రియం
హరిహరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»


తురగ వాహనం సుందరాణనం
వరగధాయుదం వేద వర్ణితం
గురు కృపాకరం కీర్తన ప్రియం
హరి హరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»


త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్య దేశికం
త్రిదశ పూజితం చింతిత ప్రదం
హరిహరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

భవభయాపహం భావుకావహం
భువన మోహనం భూతి భూషణం
ధవళ వాహనం దివ్య వారణం
హరిహరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

కల మృదుస్మితం సుందరాణనం
కలభ కోమలం గాత్ర మోహనం
కలభ కేసరి వాజి వాహనం
హరి హరాత్మజం దేవ మాశ్రయే

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

శ్రిత జన ప్రియం చింతిత ప్రదం
శ్రుతి విభూషణం సాధు జీవనం
శృతి మనోహరం గీత లాలాసం
హరి హరాత్మజం దేవ మాశ్రయే


«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»



Listen this great and wonderful song sung by Mr. K J Yesudas here.

Friday, August 29, 2008

కున్నం శ్రీ ధర్మ శాస్త ఆలయం, కేరళ







కున్నం అయ్యప్ప ఆలయం

Sri ayyappa pancharatnam Lyrics

Sri Ayyappa Pancharathnam

Listen part of this song with the voice of great Mr. K.J Yesudas here!

Listen the full song of Ayyappa Pancharatnam here!


లోకవీరం మహా పూజ్యం
సర్వ రక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!




విప్ర పూజ్యం విశ్వ వంద్యం
విష్ణు శంభో శివం సుతం
క్షిప్ర ప్రసాద నిరతం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!



మత్త
మాతంగ గమనం
కారున్యామృత పూరితం
సర్వ విఘ్న హారం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!



అస్మత్ కులేస్వరం దేవం
అస్మత్ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!



పాంద్యేశ వంశ తిలకం
కేరలే కేళి విగ్రహం
ఆర్తత్రాణ వరం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!




పంచ రత్నఖ్య మేతద్యో
నిత్యం స్తోత్రం పటేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్
శాస్తా వసతి మానసే
స్వామియే శరణం అయ్యప్ప !!!





భూతనాథ సదానంద
సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహా బాహొ
శాస్తే తుభ్యం నమో నమః
స్వామియే శరణం అయ్యప్ప !!!




శబరి పర్వతే పూజ్యం
శాంత మానస సంస్థితం
భక్తౌశు పాప హన్తారం
అయ్యప్పన్ ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!