Friday, November 28, 2008

Satyamu Jyotiga Velugunayaa... Ayyappa

Makara Jyothi
సత్యము జ్యోతిగ వెలుగునయా
నిత్యము దానిని చూడుమయా
పరుగున మీరు రారయ్యా
శబరి గిరికి పోవుదము


శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరీశా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురు స్వామియే శరణం అయ్యప్ప


హరిహర మానస సుతుడైన
సురల మొరలను ఆలించి
భువిలో తాను జనియించి
పడునాల్గేండ్లు వసియించి

Sabarimala Makara Jyothi
ఘోరా తడవిలో బాలునిగా
సర్పము నీడలో పవళించి
వేటకు వచ్చిన రాజునకు
పసి బాలునిగా కనిపించి


మనికంట అను
నామముతో
పెంచిరి బాలుని మురిపెముగా
స్వామి మీ మహిమలతో
రాజుకు కలిగెను సుతుడొకడు
Ayyappa

గురువాసంలో చదివించి
గురు పుత్రున్ని దీవించి
మాటలు రాని బాలునకు
మాటలు వచ్చెను మహిమలతో

మాతా పితలను సేవించి

మహిషి ని తాను వధియించి

శబరి గిరిలో వేలిసిరి గా మనలను ధన్యుల జేయుటకు

అయ్యప్పా అను నామముతో

శిలా రూపమున తానున్నా

జ్యోతి స్వరూపా మహిమలతో

భక్తుల కోర్కెలు దీర్తురయా

మార్గశిరాన మొదలెట్టి

నలుబది దినముల దీక్షతో

శరణుని భజనలు చేయుచునూ

ఇరుముడి కట్టి పయనించి

భోగికి ముందు చేరాలి

మకర సంక్రాంతి చూడాలి

చాలు చాలు మనకింకాAyyappa

వలదు వలది ఇక జన్మ

మకర సంక్రాంతి దినమున

సాయం సమయం వేళలో

సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతిగా దర్శన మిచ్చేదరు


పాలాభిషేకం స్వామీకి

నేయ్యాభిషేకం స్వామీకి

తేనాభిషేకం స్వామీకి

పూలాభిషేకం స్వామీకి

కర్పూర హారతి తనకెంతో

పాయసమంటే మరి ఎంతో

శరణన్న పదము ఎంతెంతో
ఇష్టం ఇష్టం స్వామికి

హరివరాసనం స్వామీది
సుందర రూపం స్వామీది
కనుల పండుగ మనకేలే
జన్మ తరించుట మనదేలే

శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం శరణ మయా
శరణం శరణం మా స్వామి
నీ దరికి జేర్చుకో మా స్వామి

Wednesday, November 19, 2008

శరణం గణేశా శరణం గణేశా

శరణం గణేశా శరణం గణేశా
గణేశ శరణం శరణం గణేశా
గజ ముఖ వదనా శరణం గణేశా
పార్వతి పుత్రా శరణం గణేశా " శరణం "
మూషిక వాహన శరణం గణేశా
మోదక హస్తా శరణం గణేశా " శరణం "
శంభు కుమారా శరణం గణేశా
శక్తీసుపుత్రా శరణం గణేశా " శరణం "
షణ్ముఖ సోదర శరణం గణేశా
సంకట నాశన శరణం గణేశా " శరణం "
సిద్ధి వినాయక శరణం గణేశా
బుద్ధి వినాయక శరణం గణేశా " శరణం "
ఓంకార గణపతి శరణం గణేశా
కన్నె మూల గణపతి శరణం గణేశా " శరణం "

Saranam Saranamayaa... Ayyappa... Swami

మా జగిత్యాల శ్రీ ధర్మశాస్త ఆలయ పూజారి శ్రీ లక్ష్మి పతి గురు స్వామి గారి దివ్య ఆశీస్సులతో ...

శరణం శరణమయా స్వామీ

శరణం శరణమయా అయ్యప్పా

శరణం అన్నా మరణం లేదు

శబరి గిరి నిలయా ... " శరణం "

అందరి దేవుడవే స్వామి

ఆదరించు దేవుడవే అయ్యప్పా

అయ్యప్ప దేవుడవే స్వామి

అరణ్య వాసుడవే స్వామి " శరణం "

హరి హర పుత్రుడవే స్వామి

ఆనంద రూపుడవే అయ్యప్పా

మోహిని పుత్రుడవే స్వామి

మోహన రూపుడవే అయ్యప్పా " శరణం "

మహిషి మర్ధనుడా స్వామి

మదగజ వాహనుడా అయ్యప్పా

వనపులి వాహనుడా నీకు

వందనము జేసేదము అయ్యప్పా " శరణం "

గజ ముఖ సోదరుడా స్వామి

షణ్ముఖ సోదరుడా అయ్యప్పా

కారణ జన్ముడవే స్వామి

కావగా రావయ్యా అయ్యప్పా " శరణం "

కార్తీక మాసానా స్వామి

నీ మాల వేసుకుంటూ అయ్యప్పా

నలుబది దినములు స్వామి

దీక్షతో కొలిచెదము అయ్యప్పా " శరణం "

ఇరుముడి వేసుకొని స్వామి

నిన్నే తలచుకొని అయ్యప్పా

శబరి గిరి జేరి నిన్నే

దర్శించుకుంటాము అయ్యప్ప " శరణం "

పాలాభిషేకమయ్య నీకు

నేయ్యాభిశేక మయ్యా అయ్యప్పా

చేయగా చూసాము నీకు

శరణము పలికెదము అయ్యప్పా " శరణం "

తప్పులు ఎన్నెన్నో మేము

అనుదినము చేసినాము అయ్యప్పా

తండ్రి వోలె దరి జేర్చి మమ్ము

దయతో బ్రోవుమయా అయ్యప్పా " శరణం "

Thursday, November 13, 2008

జై విఘ్నేశ్వర

వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

Ammavu neevani Tallivi neevani ...

ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ "శ్రీ శ్రీనివాస్" గారి నోటి నుండి జాలు వారిన ఈ పాట ...

అమ్మవు నీవని తల్లివి నీవని నిను కొలిచేమమ్మా

అమ్మా నిను తలచేమమ్మా "౨"

ముత్యాలు వద్దు , వెండి వద్దు, పగడాలు వద్దు

కరుణేచాలమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

బంగారం వద్దు వెండి వద్దు సంపద వద్దు

దీవెన చాలమ్మా అమ్మా నీ దీవెన చాలమ్మా " అమ్మ "

గార్వాల బిడ్డవు కానే కావు గారవం అసలే చేయనే చెయ్యవు

ఆడించాలమ్మా మమ్ము ఆడించాలమ్మ " అమ్మ "

గళ్ళు గళ్ళు గజ్జేల్లో సన్న జాజి మొగ్గల్లో మల్లె మల్లె మొగ్గల్లో

నడిచి రావమ్మా అమ్మ నడిచి రావమ్మా " అమ్మ "

కుంకుమాభిషేకం చందనాభిషేకం గందాభిషేకం

అన్నీ నీకమ్మా అమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

పన్నీరాభిషేకం పాలాభిషేకం పూలాభిషేకం

అన్నీ నీ కమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

కంచి కామాక్షి మధుర మీనాక్షి శ్రీశైల భ్రమరాంభ

అన్నీ నీవమ్మా అమ్మ నీ కరుణే చాలమ్మా " అమ్మ "

ఓరుగల్లు భద్రకాళి ఓరుగల్లు సంతోషి హన్మకొండ పద్మాక్షి

అన్నీ నీవమ్మా అమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "

Ayyappa Naava Paata

మా గురు స్వామి దశరధ రెడ్డి గారి దివ్య ఆశీస్సులతో ...
శబరి మలై నౌక - సాగి పోతున్నది
అయ్యప్ప నౌక - సాగి పోతున్నది
నామంబు పలికితే - నావ సాగిపోతున్నది
అందులో చుక్కాని - శ్రీ మణికంటుడు
అందులో తెరచాప - మా మణి కంటుడు
అమ్మలారా అయ్యలారా - రండి రండి మీరు
తేడ్దేయ్య పని లేదు - తెర చాప అక్కర లేదు
నీరు లేకుండానే - నావ సాగి పోతుంది
డబ్బిచ్చి మీరు - ఈ నావ ఎక్కలేరు
జ్ఞానమనే ధనము - అందించు మీకు
కష్ట సుఖములు రెండు - ఘనమైన కెరటాలు
కదలకండి బాబు - మెదలకండి బాబు

Friday, November 7, 2008

Bhagavaan Saranam - Bhagavati Saranam

భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవానే - భగవతియే
దేవనే - దేవియే
ఈశ్వరనే - ఈశ్వరియే

" భగవాన్ "
నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించేదము అయ్యప్ప
పగలు రేయి నీ నామమ్మే స్మరియించేదము అయ్యప్ప

" భగవాన్ "
కరిమల వాసా పాప వినాశా శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్ప
" భగవాన్ "
మహిషి సంహారా మద గజ వాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాసా సుందర రూపా శరణం శరణం అయ్యప్పా

" భగవాన్ "

Intha Thodarendukayya Kanne Swami

సన్నిధానానికి చేరుకోటానికి పరితపించే మా కన్నె స్వామి శివని చూస్తుంటే......

ఇంత తొందరెన్ దుకయ్య కన్నె స్వామి
కాలు నిలువ దాయే నీకు కన్నె స్వామీ
భక్తీ తో నీ మనసు కన్నె స్వామి
ఉయ్యాల లూగుతోంది కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
మేడలోన మాల ముఖ్యం తల మీద ఇరుముడి ముఖ్యం
నువ్వు శరణు ఘోష చేసుకుంటూ కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
అడుగు అడుగున రాల్లుంటాయి
దారి పొడవునా ముల్లుంటాయి
నీవు అడుగు వేస్తె చాలునయ్య కన్నె స్వామి
రాళ్ళు ముళ్ళు పూలవుతాయి కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
గురు స్వామి ని వదలబోకు శరణు ఘోష విడువ బోకు
నువ్వు గురు స్వామి దీవెన తోని కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
పంబ లోన స్నానమాడి పడునేట్టాం బడి నేక్కాలయ్య
నువ్వు సన్నిధానం చేరుకొని కన్నె స్వామి
జ్యోతినే దర్శించాలయ్య కన్నె స్వామి.
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "

Monday, November 3, 2008

Chinni Chinni Vaadive Ayyappa

మా రవీందర్ గురు స్వామి గారి ఆశీర్వచనములతో ...
చిన్ని చిన్ని వాడివే అయ్యప్పా
చిన్నారి పసి వాడివే అయ్యప్పా
కన్నా వారి ప్రేమ కాస్తైనా తెలియని పొన్నంబల రెడువే

" చిన్ని చిన్ని"
వికృత రూపంబున అయ్యప్ప భూత నాధుడ వైతివా అయ్యప్ప
లోక రక్షణ కొరకు బ్రహ్మ కార్యార్తివై బాల రూపము దాల్తివా
లాలా లెవ్వరు బోసిరి అయ్యప్ప జోల లెవ్వరు పాడిరి అయ్యప్ప
పాలు బువ్వ పెట్టి జోల పాట పాడి ఎవరు నిను జోకోట్టిరి
ఎంత ఒంటరి వాడివి అయ్యప్ప ఎన్నాళ్ళ పసి వాడివి అయ్యప్ప
ఏకాంత వాసి వై పొన్నంబల పైన ఎన్నాళ్ళు కూచుంటివి
దేవతలు నిను జూచిరి అయ్యప్ప ఆహాకారము జేసిరి అయ్యప్ప
చిన్న వాడివని గద్దేక్క రాదనీ మెట్లయ్యి ఎక్కిన్చిరి.

"చిన్ని చిన్ని "
కనులా కందని రూపము అయ్యప్ప మాట కందని రూపము
మకర సంక్రాన్తిన రెండు కన్నులు తెరిచి లోకాన్ని చూస్తుంతివా
కల లోన నిను జూచితి అయ్యప్ప కన్నీరు నే గార్చితే అయ్యప్ప
గురువులకు గురువైన బాల గురు స్వామి నీ మతము నే దాల్చితి

"చిన్ని చిన్ని "
జో జో జో జో జో జో ....