ఇరుముడి కట్టి నెత్తి మీద పెట్టి అయ్యప్పా నీ కొండ జేరంగా అయ్యప్పా నీ చెంత జేరంగా
ఇరుముడి కట్టి నెత్తి మీద పెట్టి అయ్యప్పా నీ కొండ జేరంగా అయ్యప్పా నీ చెంత జేరంగా
శబరీ కొండల్లో శరణు ఘోష జేస్తూ అయ్యప్పా మేము సాగిపోవంగా మణికంటా నీ చెంత జేరంగా
శబరీ కొండల్లో శరణు ఘోష జేస్తూ అయ్యప్పా మేము సాగిపోవంగా మణికంటా నీ చెంత జేరంగా
నీ దివ్యా దర్శనమూ అందించయ్యా నమ్మిన భక్తులను నువ్వు కరుణించయ్యా
నీ దివ్యా దర్శనమూ అందించయ్యా నమ్మిన భక్తులను నువ్వు కరుణించయ్యా
" ఇరుముడి "
విల్లాలి వీర మణి కంట విజయాల నందించు అయ్యప్పా నీ అభాయాలు మాకివ్వు అయ్యప్పా
విజయాల నందించు అయ్యప్పా నీ అభాయాలు మాకివ్వు అయ్యప్పా
పద్దెనిమిది మెట్లల్ల ఓ మణి కంట మెట్టు మెట్టుకు నీవే అయ్యప్పా మా దిక్కు మొక్కు నీవే అయ్యప్పా
మెట్టు మెట్టుకు నీవే అయ్యప్పా మా దిక్కు మొక్కు నీవే అయ్యప్పా
కరిమల వాసా స్వామీ జ్యోతి స్వరూపా కరుణించి కాపాడే ఓ దివ్య తేజుడా
ఇరుముడి గట్టి అర్రర్రే ఇరుముడి గట్టి .. భలే భలే ఇరుముడి గట్టి....
కన్నె స్వామినై నీ కొండ కొచ్చేను అయ్యప్పా చిన్నఅ పాదాన్ని దాటించు పైలంగా పెద్ద పాదాన్ని దాటించు
అయ్యప్పా చిన్నఅ పాదాన్ని దాటించు పైలంగా పెద్ద పాదాన్ని దాటించు
నలభై ఒక్క రోజు దీక్షను చేపట్టి మణి కంట నీ పూజలు జేసేము అయ్యప్పా నీ స్మరణము జేసేము
మణి కంట నీ పూజలు జేసేము అయ్యప్పా నీ స్మరణము జేసేము
హరి హర పుత్రుడవు నీవు అయ్యప్ప స్వామీ గండాలు బాపేటి బంగారు మా స్వామి
" ఇరుముడి "
నేయ్యాభిశేకాలు జేసే మయ్యా పదు నెట్టాం బడి అయ్యప్ప మా ఊపిరి నీవే అయ్యప్పా
పదు నెట్టాం బడి అయ్యప్ప మా ఊపిరి నీవే అయ్యప్పా
సుందర రూపం దివ్య స్వరూపం కరిమల వాసా అయ్యప్పా మా కాంతి మల వాసా అయ్యప్ప
కరిమల వాసా అయ్యప్పా మా కాంతి మల వాసా అయ్యప్ప
కొండల్లో వెలసిన కొండంత దేవుడా మా గుండె గుడిలోనా కొలువుండి పోవయ్యా
" ఇరుముడి "
శరణమంటూ నీ కొండకొచ్చేము కష్టాలన్నీ తీర్చు అయ్యప్ప మా కన్నీల్లనే దుడువు అయ్యప్పా
కష్టాలన్నీ తీర్చు అయ్యప్ప మా కన్నీల్లనే దుడువు అయ్యప్పా
కొండ మీద ఉన్న ఓ దండి దేవా దండాలే ఓ అయ్యప్పా మా అండ దండ నీవే అయ్యప్ప
దండాలే ఓ అయ్యప్పా మా అండ దండ నీవే అయ్యప్ప
ప్రతి ఏటా నీ కొండ కోచ్చేమయ్యా ప్రతి పూటా నిను దలచి మొక్కేమయ్యా
" ఇరుముడి "