Thursday, November 18, 2010

Kaartheeka maasam vachchindo

కార్తీక మాసం వచ్చిందో... అయ్యప్ప దీక్షను తెచ్చిందో ...
అయ్యాగుడిలల్ల ... సన్నిధానముల  
స్వామీ గుడి లల్ల ... పడి పూజలల్ల
స్వాములు భక్తులు సేవలు జేస్తుండ్రో

"కార్తీక మాసం"

కన్నె స్వాములే వస్తున్నారు 
తులసి మాలలే వేస్తున్నారు 
స్వామి దీక్షలే పడుతున్నారు 
నల్ల బట్టలే వేస్తున్నారు 
"కన్నె స్వాములే"
ధూపం దీపం పూజలు జేస్తుండ్రో 
చందన గంధం పూసుకుంటున్నారు
భక్తులు భజనలు జేసుకుంటున్నారు 
పడి పూజలు స్వాములు జేస్తుండ్రో 

" కార్తీక మాసం "

అరటి మట్టలే బెడుతున్నారు
సన్నిధానమే జేస్తున్నారు
నారికేలమే తెస్తున్నారు 
నవ దళములు పెడుతున్నారు 
" అరటి "
కేరళ పూజలు జేస్తున్నారో...
నాదం వేదం పటిస్తున్నారు
తెల్ల వారంగానే పొద్దు వూకంగానే 
చన్నీటి స్నానాలు జేస్తున్నారు...

" కార్తీక మాసం "

సాదు జీవితం జీవిస్తున్నారు 
చేడునంత ఇద్చి పెడ్తున్నారు 
బంతి మాలలే కడ్తున్నారు 
నిమ్మ మాలలే వేస్తున్నారు 
" సాదు జీవితం "
నెయ్యి దీపం వెలిగిస్తున్నారు....
స్వామిని రమ్మని పిలుస్తున్నారో 
బంగారు బాలుని జ్యోతి జూడనీకి 
ఇరు ముడి గట్టుకు పోతూ ఉన్నారు 

" కార్తీక మాసం "

సాధు సంతర్పణ జేస్తున్నారు 
అంబారి పైన దిప్పు తున్నారు 
భక్తితో స్వాములు ఆడుతున్నారు 
అయ్యప్ప పాటలు పాడుతున్నారు 
"సాధు సంతర్పణ"
దానం ధర్మం స్వాములు జేస్తుండ్రో 
భక్తితో స్వాములు పరవశిస్తున్నారు 
సన్నిధానమందు గురు స్వామితో 
జ్ఞాన బోధ విని తరియిస్తున్నారో... 

"కార్తీక మాసం"

Ayyappa Neeraajanam

శబరాద్రి వాస శంకర శ్రీ నందన 
కరిమల స్వామి అయ్య నీరాజనం 
ధర్మ శాస్త అయ్యప్ప నీరాజనం 

మణి కంట ధారుడా పందల రా కుమారుడా 
శ్రీ విష్ణు రూప నీకు నీరాజనం 
మోహిని సుత అయ్యప్ప నీరాజనం 

పంపా తీర వాసుదా పావన స్వరూపుడా 
శరణు ఘోష ప్రియుడ స్వామి నీరాజనం 
శబరీ పీటం అయ్యప్ప నీరాజనం 

మకర జ్యోతి రూపుదా మంగళ ప్రదాయకా 
జ్ఞాన కాంతి దాత నీకు నీరాజనం 
జగమేలు అయ్యప్ప నీరాజనం 

తులసి మాల ధారుడా ఓ వనపులి వాహనా 
స్వాములంత కలిసి నీకు నీరాజనం 
కన్నె స్వామి అయ్యప్ప నీరాజనం 

మహిషికి మద మనచినా మహిమాన్విత రూపుడా
చిరునవ్వుల చిన్ని స్వామి నీరాజనం 
మా స్వామి అయ్యప్ప నీరాజనం 

నేయ్యాభిషేకము అయ్యా నీకిష్టము 
నెయ్యమైన స్వామి నీకు నీరాజనం 
ఇష్ట దైవమయ్యప్ప నీరాజనం 
కర్పూర ప్రియ అయ్యప్ప 
కామితార్థ ప్రదాత 
పంచ గిరుల స్వామి నీకు నీరాజనం 
మనసారా అయ్యప్ప నీరాజనం 
మనసారా అయ్యప్ప నీరాజనం 
మా మనసారా అయ్యప్ప నీరాజనం