Sunday, February 27, 2011

Sabari kondapai velisina Ayyappaa...

శబరి కొండపై వెలిసిన అయ్యప్పా 
నీ అండ దండ మాకుండాలని 
కొబ్బరి కాయలు పూలు పండ్లు
పలహారములే తెచ్చితిమయ్యప్పా
" శబరి కొండపై "

భవ బంధాలను వీడామయ్య భక్తితో నిన్నే కొలిచామయ్యా 
మండల వ్రతమే చేసామయ్యా  మదిలో నిన్నే తలచామయ్యా 
ఎరుమేలి వాసా ఏకాంత వాసా...
ఎరుమేలి వాసా ఏకాంత వాసా  ఏమని నిన్ను కొలిచేమయ్యప్పా
" శబరీ కొండపై "

ఐదు కొండలు దాటోచ్చాము ఎండవానలకు మేమొచ్చాము 
నీ నామమునే పలుకుతూ రాగా నీ పాటలనే పాడుతూ రాగా 
పంపా వాసా పందల రాజా... 
పంపా వాసా పందల రాజా పాపాలను కదా తీర్చగా రావయ్యా 
" శబరి కొండపై "

పాలాభిషేకం పూలాభిషేకం తేనభిషేకం భాస్మభిషేకం 
నేయ్యభిషేకం చేసామయ్యా జ్యోతిగా దర్శనమిచ్చినవయ్యా    
జగములనేలే ఓ శబరీశా ...
జగములనేలే ఓ శబరీశా జన్మ ధన్యము చేయగా రావయ్యా 
" శబరి కొండపై "
 

 

Swami raa... Raa raa raa raa

స్వామీ రా... రా రా రా రా 
అయ్యా రా... రా రా రా రా
    "స్వామీ రా "
మణి మాలా ధారుడా మహినేలే దేవుడా 
నీ భక్తుల బ్రోవగా కొండ దిగి రావయ్యా 
    " స్వామి రా "

శబరి మలై కొండల్లో కొలువై ఉన్నావంటా
నీలి మలై నీడల్లో నిలిచి ఉన్నావంటా 
పంపా నది తీరాన పవళించి ఉన్నావంటా 
పందల రాజయ్య చెంత చేర రావయ్యా 
    "స్వామి రా "

కాషాయం కట్టినోల్లు కఠిన దీక్షలున్నారు 
నీలి వస్త్ర మేసినోల్లు నియమంతో ఉన్నారు 
నల్ల బట్టలేసినోల్లు నిన్నే నమ్ముకున్నారు 
నిండిన మా స్వామి అండగా నువ్వు రావయ్యా 
    " స్వామి రా "

ప్రకృతంతా నీ కోసం పులకరించి పోయింది 
పున్నాగలు విరి మల్లెలు కాచి విరగ బూచాయి
నీ మేడలో ఉండాలని నీ సేవలే పొందాలని 
కొండంత ఆశతో దండగా మారింది 
    " స్వామీ రా "

పన్నీరు చిలకరించి పూ మాలలు కట్టాము 
పాతిక బెల్లం పాయసాలు పాలు పళ్ళు తెచ్చాము 
కస్తూరి గంధాలు అరగ దీసుకోచ్చాము 
అయ్యా ఓరయ్యా మా పూజలందు కోవయ్య
    " స్వామి రా "
   

 

Monday, February 21, 2011

Sabaree Kondalalo... Siva Paarvathi Thanaya

శివ పార్వతీ తనయ ఓ గణపతి 
ప్రథమముగా నీ పూజ చేసేమయా 
నీ నామ స్మరణతో జగమంతయూ 
పాపా విముక్తులే అయ్యేరయా 

భాద్రపద మాసాన నీ నోముతో 
సుగుణముగా నీ సేవ చేసేమయా 
కరుణించ రావయ్య లంబోదరా 
వరమోసగి దీవించు విఘ్నేశ్వరా 

చెంగల్వ పూబంతి గారికి గన్నేరులు 
తామరలు తంగేడు తేచ్చేమయా 
మెడ నిండా హారములు వేసేమయా 
కర్పూర హారతులు ఇచ్చేమయా    

Ekkada Choosinaa

దశ దిశాంతాలలో... ఆ దిగాంతాలలో...
భూ భువనాంతరాలలో... మన అంతరాలలో...

ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప 
సర్వాంతర్యామి నీవే అయ్యప్ప 
స్వామి శరణం అయ్యప్ప శరణం 
శరణం శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా 
                           "ఎక్కడ"

చిగురాకులలో పూవులలో నీవే అయ్యప్పా 
పసి పాపలలో వృద్ధులలో నీవే అయ్యప్పా 
ప్రతిధ్వనించే పవిత్ర నామం నీవే అయ్యప్పా 
ప్రజ్వరిల్లే స్వర్ణ రూపం నీవే అయ్యప్పా 
నీలో నాలో నాలో నీలో 
అన్నిటా అంతట అక్కడ ఇక్కడ 
                        " ఎక్కడ "

రివ్వు రివ్వున వీచే గాలిలో నీవే అయ్యప్పా 
గల గల గల గల పారే నీటిలో నీవే అయ్యప్పా 
గణ గణ గణ గణ మ్రోగే గంటలో నీవే అయ్యప్పా 
డమ డమ లాడే డమరు ధ్వనిలో నీవే అయ్యప్పా 
రాతిలో నాతిలో మానవ జాతిలో 
సకల చరాచర జీవ రాశిలో 
                      "ఎక్కడ"