ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ "శ్రీ శ్రీనివాస్" గారి నోటి నుండి జాలు వారిన ఈ పాట ...
అమ్మవు నీవని తల్లివి నీవని నిను కొలిచేమమ్మా
అమ్మా నిను తలచేమమ్మా "౨"
ముత్యాలు వద్దు , వెండి వద్దు, పగడాలు వద్దు
కరుణేచాలమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "
బంగారం వద్దు వెండి వద్దు సంపద వద్దు
దీవెన చాలమ్మా అమ్మా నీ దీవెన చాలమ్మా " అమ్మ "
గార్వాల బిడ్డవు కానే కావు గారవం అసలే చేయనే చెయ్యవు
ఆడించాలమ్మా మమ్ము ఆడించాలమ్మ " అమ్మ "
గళ్ళు గళ్ళు గజ్జేల్లో సన్న జాజి మొగ్గల్లో మల్లె మల్లె మొగ్గల్లో
నడిచి రావమ్మా అమ్మ నడిచి రావమ్మా " అమ్మ "
కుంకుమాభిషేకం చందనాభిషేకం గందాభిషేకం
అన్నీ నీకమ్మా అమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "
పన్నీరాభిషేకం పాలాభిషేకం పూలాభిషేకం
అన్నీ నీ కమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "
కంచి కామాక్షి మధుర మీనాక్షి శ్రీశైల భ్రమరాంభ
అన్నీ నీవమ్మా అమ్మ నీ కరుణే చాలమ్మా " అమ్మ "
ఓరుగల్లు భద్రకాళి ఓరుగల్లు సంతోషి హన్మకొండ పద్మాక్షి
అన్నీ నీవమ్మా అమ్మా నీ కరుణే చాలమ్మా " అమ్మ "
No comments:
Post a Comment