Thursday, December 9, 2010

Koti Maayala Vaade Ayyappa - Sri Ayyappa Swami Sannidhi

కోటి మాయల వాడే అయ్యప్ప కొండ కోనల్లో వెలసిండే అయ్యప్ప 
ఆ శబరీ క్షేత్రాన అయ్యప్ప భక్తులండగా నిలిచిండే అయ్యప్ప   "కోటి "

ముక్కోటి దేవుళ్ళ వరముతో అయ్యప్ప 
హరి హరుల కేమో జన్మించి నావంట 
అందర్నీ గాపాడ  అవని పైన నీవు  - ౨ "ముక్కోటి "

కేరళ అడవిలో  నీవు అయ్యప్ప పందల రాజుకు  అయ్యప్ప
మణి హారంతో నువ్వు అయ్యప్ప నువ్వు కనిపించి నావంట  అయ్యప్ప 
" కోటి "

ఆ రాజు నిన్ను అల్లారుముద్దుగా 
పందల రాజ్యాన పెంచుకున్నాడంతా
ఎన్నెన్నో విద్యలు నేర్పించి నాడంత  - ౨ " ఆ రాజు "

పెంచిన  రుణముతో అయ్యప్ప 
తల్లి మాట కొరకు నువ్వు అయ్యప్ప
పులి పాలను  తేను అయ్యప్ప 
నువ్వు అడవి కెళ్ళి నావా అయ్యప్ప 
" కోటి "


అడవిలో మహిషిని హత మార్చి నావంట 
పులి వాహన మెక్కి రాజ్యానికే జేరి 
నీ మహిమ ప్రజలకు చూపించి నావంట " ౨" "అడవిలో "

అబ్బబ్బ నీ లీల  అయ్యప్ప 
మాకు చెప్ప తరము కాదు అయ్యప్ప
నమ్ముకున్టిమయ్య అయ్యప్ప 
నిన్ను ఎల్ల కాలం మేము అయ్యప్ప 
" కోటి "

Bailelle Bailelle Thumbiyallo

బైలెల్లె బైలెల్లె తుమ్బియాల్లో అగో అయ్యప్ప స్వాములే తుమ్బియాల్లో అగో అయ్యప్ప స్వాములే తుమ్బియాల్లో  - 2
శబరి యాత్ర చేయ తుమ్బియాల్లో అగో బైలేల్లి నారమ్మ తుమ్బియాల్లో  - 2
 " బైలెల్లె "

ఇరుముడెత్తుకొని  తుమ్బియాల్లో గురు స్వాములతో కలిసి - తుమ్బియాల్లో  గురు స్వాములతో కలిసి - తుమ్బియాల్లో  - 2
మండల దీక్షతో తుమ్బియాల్లో మణి కంటున్ని కొలువంగ తుమ్బియాల్లో- మణి కంటున్ని కొలువంగ తుమ్బియాల్లో - 2

కారడవి తోవల్లో - తుమ్బియాల్లో 
 కాలి నడకతో స్వాములు - తుమ్బియాల్లో
కరిమల కొండెక్కి - తుమ్బియాల్లో
ఎరుమేలి జేరంగ - తుమ్బియాల్లో 
"బైలెల్లె "



కన్నె స్వాముల తోటి - తుమ్బియాల్లో పాటలెన్నో పాడుకుంటూ తుమ్బియాల్లో పేట తుల్లటలాడుతూ - తుమ్బియాల్లో - 2
కాలైకట్టాస్రమమే - తుమ్బియాల్లో కన్ను లారా దర్శించుకొని - తుమ్బియాల్లో కన్ను లారా దర్శించుకొని - తుమ్బియాల్లో- 2
అలుదానది స్నానం- తుమ్బియాల్లో
అలసట దీర్చంగా  - తుమ్బియాల్లో 
కరిమల కొండను - తుమ్బియాల్లో 
కన్ను లారా దర్శించగా - తుమ్బియాల్లో

"బైలెల్లె "

కన్నె మూల గణపతికి - తుమ్బియాల్లో  పాల కాయనే కొట్టేరు - తుమ్బియాల్లో పాల కాయనే కొట్టేరు - తుమ్బియాల్లో  - 2
పద్దేన్మిది మెట్లెక్కి - తుమ్బియాల్లో  అయ్యప్పను దర్శించి - తుమ్బియాల్లో అయ్యప్పను దర్శించి - తుమ్బియాల్లో  - 2
అభిషేక సేవలు  - తుమ్బియాల్లో
అయ్యప్పకు జేసేరు  - తుమ్బియాల్లో 
కాంతి మలై  శిఖరమందు  - తుమ్బియాల్లో 
జ్యోతినే చూసేరు - తుమ్బియాల్లో 
"బైలెల్లె "

Thursday, November 18, 2010

Kaartheeka maasam vachchindo

కార్తీక మాసం వచ్చిందో... అయ్యప్ప దీక్షను తెచ్చిందో ...
అయ్యాగుడిలల్ల ... సన్నిధానముల  
స్వామీ గుడి లల్ల ... పడి పూజలల్ల
స్వాములు భక్తులు సేవలు జేస్తుండ్రో

"కార్తీక మాసం"

కన్నె స్వాములే వస్తున్నారు 
తులసి మాలలే వేస్తున్నారు 
స్వామి దీక్షలే పడుతున్నారు 
నల్ల బట్టలే వేస్తున్నారు 
"కన్నె స్వాములే"
ధూపం దీపం పూజలు జేస్తుండ్రో 
చందన గంధం పూసుకుంటున్నారు
భక్తులు భజనలు జేసుకుంటున్నారు 
పడి పూజలు స్వాములు జేస్తుండ్రో 

" కార్తీక మాసం "

అరటి మట్టలే బెడుతున్నారు
సన్నిధానమే జేస్తున్నారు
నారికేలమే తెస్తున్నారు 
నవ దళములు పెడుతున్నారు 
" అరటి "
కేరళ పూజలు జేస్తున్నారో...
నాదం వేదం పటిస్తున్నారు
తెల్ల వారంగానే పొద్దు వూకంగానే 
చన్నీటి స్నానాలు జేస్తున్నారు...

" కార్తీక మాసం "

సాదు జీవితం జీవిస్తున్నారు 
చేడునంత ఇద్చి పెడ్తున్నారు 
బంతి మాలలే కడ్తున్నారు 
నిమ్మ మాలలే వేస్తున్నారు 
" సాదు జీవితం "
నెయ్యి దీపం వెలిగిస్తున్నారు....
స్వామిని రమ్మని పిలుస్తున్నారో 
బంగారు బాలుని జ్యోతి జూడనీకి 
ఇరు ముడి గట్టుకు పోతూ ఉన్నారు 

" కార్తీక మాసం "

సాధు సంతర్పణ జేస్తున్నారు 
అంబారి పైన దిప్పు తున్నారు 
భక్తితో స్వాములు ఆడుతున్నారు 
అయ్యప్ప పాటలు పాడుతున్నారు 
"సాధు సంతర్పణ"
దానం ధర్మం స్వాములు జేస్తుండ్రో 
భక్తితో స్వాములు పరవశిస్తున్నారు 
సన్నిధానమందు గురు స్వామితో 
జ్ఞాన బోధ విని తరియిస్తున్నారో... 

"కార్తీక మాసం"

Ayyappa Neeraajanam

శబరాద్రి వాస శంకర శ్రీ నందన 
కరిమల స్వామి అయ్య నీరాజనం 
ధర్మ శాస్త అయ్యప్ప నీరాజనం 

మణి కంట ధారుడా పందల రా కుమారుడా 
శ్రీ విష్ణు రూప నీకు నీరాజనం 
మోహిని సుత అయ్యప్ప నీరాజనం 

పంపా తీర వాసుదా పావన స్వరూపుడా 
శరణు ఘోష ప్రియుడ స్వామి నీరాజనం 
శబరీ పీటం అయ్యప్ప నీరాజనం 

మకర జ్యోతి రూపుదా మంగళ ప్రదాయకా 
జ్ఞాన కాంతి దాత నీకు నీరాజనం 
జగమేలు అయ్యప్ప నీరాజనం 

తులసి మాల ధారుడా ఓ వనపులి వాహనా 
స్వాములంత కలిసి నీకు నీరాజనం 
కన్నె స్వామి అయ్యప్ప నీరాజనం 

మహిషికి మద మనచినా మహిమాన్విత రూపుడా
చిరునవ్వుల చిన్ని స్వామి నీరాజనం 
మా స్వామి అయ్యప్ప నీరాజనం 

నేయ్యాభిషేకము అయ్యా నీకిష్టము 
నెయ్యమైన స్వామి నీకు నీరాజనం 
ఇష్ట దైవమయ్యప్ప నీరాజనం 
కర్పూర ప్రియ అయ్యప్ప 
కామితార్థ ప్రదాత 
పంచ గిరుల స్వామి నీకు నీరాజనం 
మనసారా అయ్యప్ప నీరాజనం 
మనసారా అయ్యప్ప నీరాజనం 
మా మనసారా అయ్యప్ప నీరాజనం

Wednesday, September 22, 2010

Irumudi katti Neththi meeda petti Ayyappa

ఇరుముడి కట్టి నెత్తి మీద పెట్టి అయ్యప్పా నీ కొండ జేరంగా అయ్యప్పా నీ చెంత జేరంగా
ఇరుముడి కట్టి నెత్తి మీద పెట్టి అయ్యప్పా నీ కొండ జేరంగా అయ్యప్పా నీ చెంత జేరంగా
శబరీ కొండల్లో శరణు ఘోష జేస్తూ అయ్యప్పా మేము సాగిపోవంగా మణికంటా నీ  చెంత జేరంగా
శబరీ కొండల్లో శరణు ఘోష జేస్తూ అయ్యప్పా మేము సాగిపోవంగా మణికంటా నీ  చెంత జేరంగా 
నీ దివ్యా దర్శనమూ అందించయ్యా నమ్మిన భక్తులను నువ్వు కరుణించయ్యా
నీ దివ్యా దర్శనమూ అందించయ్యా నమ్మిన భక్తులను నువ్వు కరుణించయ్యా
" ఇరుముడి "

విల్లాలి వీర మణి కంట విజయాల నందించు అయ్యప్పా నీ అభాయాలు మాకివ్వు అయ్యప్పా
విజయాల నందించు అయ్యప్పా నీ అభాయాలు మాకివ్వు అయ్యప్పా
పద్దెనిమిది మెట్లల్ల ఓ మణి కంట మెట్టు మెట్టుకు నీవే అయ్యప్పా మా దిక్కు మొక్కు నీవే అయ్యప్పా
మెట్టు మెట్టుకు నీవే అయ్యప్పా మా దిక్కు మొక్కు నీవే అయ్యప్పా
కరిమల వాసా స్వామీ జ్యోతి స్వరూపా కరుణించి కాపాడే ఓ దివ్య తేజుడా

ఇరుముడి గట్టి అర్రర్రే ఇరుముడి గట్టి .. భలే భలే ఇరుముడి గట్టి....

కన్నె స్వామినై నీ కొండ కొచ్చేను అయ్యప్పా చిన్నఅ పాదాన్ని దాటించు పైలంగా పెద్ద పాదాన్ని దాటించు
అయ్యప్పా చిన్నఅ పాదాన్ని దాటించు పైలంగా పెద్ద పాదాన్ని దాటించు
నలభై ఒక్క రోజు దీక్షను చేపట్టి మణి కంట నీ పూజలు జేసేము అయ్యప్పా నీ స్మరణము జేసేము 
మణి కంట నీ పూజలు జేసేము అయ్యప్పా నీ స్మరణము జేసేము
హరి హర పుత్రుడవు నీవు అయ్యప్ప స్వామీ గండాలు బాపేటి బంగారు మా స్వామి
" ఇరుముడి "

నేయ్యాభిశేకాలు జేసే మయ్యా పదు నెట్టాం బడి అయ్యప్ప మా ఊపిరి నీవే అయ్యప్పా
 పదు నెట్టాం బడి అయ్యప్ప మా ఊపిరి నీవే అయ్యప్పా
సుందర రూపం దివ్య స్వరూపం కరిమల వాసా అయ్యప్పా మా కాంతి మల వాసా అయ్యప్ప 
కరిమల వాసా అయ్యప్పా మా కాంతి మల వాసా అయ్యప్ప 
కొండల్లో వెలసిన కొండంత దేవుడా మా గుండె గుడిలోనా కొలువుండి పోవయ్యా
" ఇరుముడి "

శరణమంటూ నీ కొండకొచ్చేము కష్టాలన్నీ తీర్చు అయ్యప్ప మా కన్నీల్లనే దుడువు అయ్యప్పా 
కష్టాలన్నీ తీర్చు అయ్యప్ప మా కన్నీల్లనే దుడువు అయ్యప్పా 
కొండ మీద ఉన్న ఓ దండి దేవా దండాలే ఓ అయ్యప్పా మా అండ దండ నీవే అయ్యప్ప 
దండాలే ఓ అయ్యప్పా మా అండ దండ నీవే అయ్యప్ప 
ప్రతి ఏటా నీ కొండ కోచ్చేమయ్యా ప్రతి పూటా నిను దలచి మొక్కేమయ్యా
 " ఇరుముడి "

Thursday, September 9, 2010

Hari Hara Thanayaa :: Sharanu Ghosha Priyudu Ayyappa

హరి హర తనయా ఆపద్భాందవ స్వామి అయ్యప్పా మా తండ్రీ అయ్యప్పా
శరణంటూ వేడితిమి కరుణించయ్య  స్వామి అయ్యప్పా 
శరణంటూ వేడితిమి కరుణించయ్య  స్వామి అయ్యప్పా 
శబరి గిరీశా అభయ స్వరూపా స్వామీ అయ్యప్పా మా తండ్రీ అయ్యప్పా 
నీ అభయ హస్తమే అందించయ్యా స్వామి అయ్యప్పా 
నీ అభయ హస్తమే అందించయ్యా స్వామి అయ్యప్పా 

మండల దీక్షలు బూనిన మయ్య మాలలు మెడలో వేసినమయ్య 
మాలలు మెడలో వేసినమయ్య 
కష్టమనక ప్రతి నిత్యం నిష్టా నియమాలను పాటించిన మయ్య  
నియమాలను పాటించిన మయ్య  
దుర్గునాలనూ అన్నీ విడిచి సద్గతి నిమ్మని వేడినమయ్య 
సద్గతి నిమ్మని వేడినమయ్య  
మనసారా నీ నామ స్మరణతో పులకిన్చామయ్యా మా స్వామి అయ్యప్పా 
నీ భక్తి లోన మై మరిచినమయ్య తండ్రీ అయ్యప్పా 
హరి హర తనయా 

ఇరుముడెత్తుకొని కాలి నడకతో కరిమలకు బైలెల్లిన మయ్య 
కరిమలకు బైలెల్లిన మయ్య 
కొండలు కోణాలు అన్నీ దాటి శబరి కొండకు చేరినమయ్యా
శబరి కొండకు చేరినమయ్యా 
పంబా నది లొ స్నానం చేసి పదునెనిమిది మెట్లేక్కినమయ్యా
పదునెనిమిది మెట్లేక్కినమయ్యా
దివ్య మైన నీ సన్నిధి చేరి తరి యించామయ్యా మా స్వామి అయ్యప్ప 
నీ దివ్య దర్శనం కలిగించయ్యా తండ్రి అయ్యప్ప 
హరి హర తనయా 

సుందరమగు నీ దివ్య మందిరం చూసి పరవశం పొందినమయ్య 
చూసి పరవశం పొందినమయ్య 
రంగు రంగు పూవులతో నీకు పుష్పాభిషేకం చేసినమయ్య  
పుష్పాభిషేకం చేసినమయ్య  
ఆవు నెయ్యితో అయ్యప్ప స్వామీ నేయ్యభిషేకం జరిపినమయ్య  
నేయ్యభిషేకం జరిపినమయ్య  

గుండె నిండుగా నీ ధ్యానముతో సేవించామయ్యా మా స్వామి అయ్యప్ప 
మా అండ దండగా తోడున్దయ్యా తండ్రీ అయ్యప్పా 
హరి హర తనయా

Ghallu Ghallunaa Raavemayyo :: Sharanu Ghosha Priyudu Ayyappa

ఘల్లు ఘల్లునా రావేమయ్యో అయ్యప్ప 
ఘనమైన మా పూజలందుకోవయ్యో  అయ్యప్ప 
ఘల్లు ఘల్లున 

అందాల సుందర రూపుదవయ్యో అయ్యప్ప 
అభిషేక సేవలు అందుకోవయ్యో అయ్యప్ప 
ఘల్లు ఘల్లున 

శబరి కొండ మీద వెలసినవయ్య 
అభయ స్వరూపంతో కొలువున్నవయ్య 
శరణు ఘోషతో నిన్నే జేరంగ 
కరుణించే కరిమల వాసుడవయ్య
కరుణించే కరిమల వాసుడవయ్య

మెట్టు మెట్టుకో పరమార్తమున్నట్టి  
పద్దెనిమిది మెట్లపై నిలిచినవయ్య 
స్వర్ణ మందిరాన దివ్య స్వరూపంతో 
సర్వ జగతి నేలుతున్నవయ్య 
సర్వ జగతి నేలుతున్నవయ్య 

పంచ గిరుల మా పావన రూపా అయ్యప్ప 
పది పూజలండగా రావేమయ్యో అయ్యప్ప 
పంచ గిరుల 
ఘల్లు గల్లునా

కార్తీక మాసాన కంట మాలలు వేసి 
కటిన నిష్ఠ తోటి నియమాలు పాటించి 
మండల రోజుల దండిగా నిలిచి 
మండపాన నిన్ను గొలిచినమయ్య
మండపాన నిన్ను గొలిచినమయ్య

డోలు సంనాయిల వాద్యాలు మొగంగా 
స్వాములంత కలిసి భజనలు జేయంగ
పాలు నెయ్యి తేనె పంచామృతాలతో 
అభిషేక సేవలు జేస్తునమయ్య 
అభిషేక సేవలు జేస్తునమయ్య 

ఆత్మ తోని నిన్ను గొలిచేమయ్యో అయ్యప్ప 
ఆదరించి సేవలందుకోవయ్యో అయ్యప్ప 
ఆత్మ తోని
ఘల్లు ఘల్లున

ఇరుముల్లతో మేము శరణంటూ  కదిలి 
కరిమల దారుల్లో కదిలి వస్తుందనగా 
కారడవిలోన కన్నా తండ్రి వోలె   "వై"
కంటికి రేప్పోలె గాపాడ రావయ్య
కంటికి రేప్పోలె గాపాడ రావయ్య

లోకమందె ఎంతో అధ్భుతమైనట్టి 
మకర జ్యోతి దర్శనాన్ని కలిగించి 
పరమ పావనమైన నీ సంనిదానాన్ని 
చేరంగ భారాన్ని తొలగించావయ్య 
చేరంగ భారాన్ని తొలగించావయ్య 

కన్నె స్వాములం కనిక రించయ్య అయ్యప్ప 
కరుణించి సేవలు స్వీకరించయ్య అయ్యప్ప 
కన్నె స్వాములం 
ఘల్లు ఘల్లున

ఎటేట మణి మాల ధరియిన్చేమయ్య 
ప్రతి ఏట నీ కొండ జేరేమయ్య 
అంతు లేని నీ సేవలు జేసి 
ఆత్మానందం పొందేమయ్యా 
ఆత్మానందం పొందేమయ్యా 

మాకున్న పాపాలు శాపాలు తొలగించి 
మా పిల్ల పాపాల్ని సల్లంగా దీవించి 
ఎల్ల వేళలా మమ్ముల గాపాడి 
నీ దయ గురిపించు కరిమల వాస
నీ దయ గురిపించు కరిమల వాస


సర్వము నీవంటూ దలచిన మయ్య  అయ్యప్ప 
సత్యంగా నిన్నే కొలిచెదమయ్య   అయ్యప్ప 
సర్వము నీవంతు 
ఘల్లు ఘల్లున 

Tuesday, August 31, 2010

Shaasta pancha ratnam

భూత నాథ సదానంద 
సర్వ భూత దయాపర 
రక్ష రక్ష మహా బాహో 
శాస్త్రే తుభ్యం నమో నమః 

స్వామియే శరణం అయ్యప్ప

లోక వీరం మహా పూజ్యం
సర్వ రక్షా కరం విభుం
పార్వతీ హృదయానందం
 శాస్తారం ప్రణమామ్యహం 

విప్ర పూజ్యం విశ్వ వంద్యం 
విష్ణు శంభో ప్రియం సుతం
శివ ప్రసాద నిరతం 
శాస్తారం ప్రణమామ్యహం 

మత్త మాతంగ గమనం 
కారున్యామృత పూరితం 
సర్వ విఘ్న హారం దేవం
శాస్తారం ప్రణమామ్యహం 

అస్మత్ కులేస్వరం దేవం
అస్మత్ శత్రు వినాశనం 
అస్మదిష్ట ప్రదాతారం 
శాస్తారం ప్రణమామ్యహం

పాంద్యేశ వంశ తిలకం
కేరలే కేళి విగ్రహం 
ఆర్త త్రాణ వరం దేవం 
శాస్తారం ప్రణమామ్యహం 

పంచ రత్నఖ్య మేతత్యో 
నిత్యం స్తోత్రం పటేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ 
శాస్తా వసతి మానసే

అరుణోదయ సంకాశం 
నీల కుండల ధారిణం 
నీలాంబర ధరం దేవం 
వందేహం బ్రహ్మ నందనం 

చాప బాణం వామ హస్తే 
రౌప్య వేతన రజ్ఞ దక్షిణే 
విలసత్ కుండల ధరం 
వందేహం విష్ణు నందనం 

వ్యాఘ్ర రూడం రక్త నేత్రం
స్వర్ణ మాలా విభూషణం 
విరాట ధరం దేవం 
వందేహం శంభు నందనం 

కింకిన్యో ధ్యాన సభ్యూశం 
పూర్ణ చంద్ర నిభాననం 
కిరాత రూప శాస్తారం 
వందేహం పాండ్య నందనం 

భూత భేతాళ సంసేవ్యం 
కాంచనాద్రి నిభాననం 
మణి కంట మితి ఖ్యాత 
వందేహం శక్తి నందనం 

యస్య ధన్వంతరి మాత 
పితా రుద్రో భీషగ్నమః
శాస్తారం త్వామహం వందే 
మహా వైద్యం దయా నిధిం 

భూత నాదాయ విద్మహే 
భవ పుత్రాయ ధీమహి 
తన్నో శాస్త ప్రచోదయాత్

Tuesday, June 1, 2010

Thunbiyallo...

శబరి కొండల్లోన తుంబియాల్లో
మన అయ్యప్ప వేలిసిండు తుంబియాల్లో 
స్వామి అయ్యప్ప వేలిసిండు తుంబియాల్లో 
" శబరి "
అయిదు కొండల మీద తుంబియాల్లో 
స్వామి అందంగా వేలిసిండు తుంబియాల్లో
అయిదు కొండల మీద తుంబియాల్లో 
స్వామి అందంగా వేలిసిండు తుంబియాల్లో 
" శబరి "



సకల రోగములు తుంబియాల్లో 
స్వామి నివారించువాడు తుంబియాల్లో
సకల రోగములు తుంబియాల్లో 
స్వామి నివారించువాడు తుంబియాల్లో 
శత్రు సంహారుడు తుంబియాల్లో 
స్వామి షన్ముగ సోదరుడు తుంబియాల్లో 
శత్రు సంహారుడు తుంబియాల్లో 
స్వామి షన్ముగ సోదరుడు తుంబియాల్లో 
శరణు ఘోష ప్రియుడు తుంబియాల్లో 
మన అందాల అయ్యప్ప తుంబియాల్లో  
శరణు ఘోష ప్రియుడు తుంబియాల్లో 
మన అందాల అయ్యప్ప తుంబియాల్లో 
" శబరి "

శరణన్న వారిని తుంబియాల్లో 
స్వామి కరుణించే దేవుడు తుంబియాల్లో 
శరణన్న వారిని తుంబియాల్లో 
స్వామి కరుణించే దేవుడు తుంబియాల్లో 
చక్కనైనా వాడు తుంబియాల్లో 
స్వామి సల్లనైనా వాడు తుంబియాల్లో
చక్కనైనా వాడు తుంబియాల్లో 
స్వామి సల్లనైనా వాడు తుంబియాల్లో 
సంకట హరనుడే తుంబియాల్లో 
స్వామి సద్గుణ మూర్తియే తుంబియాల్లో
సంకట హరనుడే తుంబియాల్లో 
స్వామి సద్గుణ మూర్తియే తుంబియాల్లో 
" శబరి "
 
పందల రాజమ్మ తుంబియాల్లో 
స్వామి పంబా బాలుడే తుంబియాల్లో
పందల రాజమ్మ తుంబియాల్లో 
స్వామి పంబా బాలుడే తుంబియాల్లో 
పెరియాన వట్టమే తుంబియాల్లో 
స్వామి పోడిసేటి పొద్దమ్మ తుంబియాల్లో
పెరియాన వట్టమే తుంబియాల్లో 
స్వామి పోడిసేటి పొద్దమ్మ తుంబియాల్లో 
పోన్నంబల వాసనే  తుంబియాల్లో 
స్వామి పాప సంహారనుడే తుంబియాల్లో
పోన్నంబల వాసనే  తుంబియాల్లో 
స్వామి పాప సంహారనుడే తుంబియాల్లో 
" శబరి "
 

Thursday, April 29, 2010

Palliket ...

పల్లింకట్టు - శబరి మలక్కు     కల్లుం ముల్లుం - కాలికి మెత్టై
స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే 
స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే  

అఖిలాండేశ్వర అయ్యప్ప     అఖిల చరేశ్వర అయ్యప్ప 
హరి ఓం బుధ ఓం అయ్యప్ప  ఆశ్రిత వత్సల అయ్యప్ప 
స్వామి ఆశ్రిత వత్సల అయ్యప్ప 
 స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే  


నేయ్యభిషేకం స్వామికే    కర్పూర దీపం స్వామికే 
భాస్మభిషేకం స్వామికే    పాలాభిషేకం స్వామికే 
స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే  

దేహబలందా అయ్యప్పా   పాద బలందా అయ్యప్పా 
నీ తిరు సన్నిధి అయ్యప్పా  చేరేమయ్యా అయ్యప్పా 
 స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే 

భగవాన్ శరణం   భగవతి శరణం 
దేవన్ శరణం      దేవి శరణం 
కర్పూర దీపం   స్వామికే 
నేయ్యభిషేకం   స్వామికే 


పల్లింకట్టు - శబరి మలక్కు     కల్లుం ముల్లుం - కాలికి మెత్టై
స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే 
స్వామియే - అయ్యప్పో        అయ్యప్పో - స్వామియే  

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

Malle Poola Pallaki

మల్లె పూల పల్లకి అందాల పల్లకి మణికంటుడు ఎక్కినాడు బంగారు పల్లకి 
మల్లె పూల పల్లకి అందాల పల్లకి మణికంటుడు ఎక్కినాడు బంగారు పల్లకి 

విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీర మణి కంటుడు ఎక్కినాడు పల్లకి  
విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీర మణి కంటుడు ఎక్కినాడు పల్లకి ... హ 
పందల బాలుడు పంబ వాసుడు హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి 

గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షన్ముగ సోదరుడు ఎక్కినాడు పల్లకి 
గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షన్ముగ సోదరుడు ఎక్కినాడు పల్లకి.. హ 
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి 

మహిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి 
మహిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి... హ 
కరిమల వాసుడు నీలిమల వాసుడు హారిహర తనయుడు ఎక్కినాడు పల్లకి

కాంతి మల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి 
కాంతి మల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి ... హ 
భక్తుల బ్రోచే బంగారు స్వామి హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి

Sunday, April 25, 2010

Shabaree Kshetramoo ...

శబరీ క్షేత్రమూ ... పరిమళ తీర్థమూ 
శబరీ క్షేత్రమూ ... పరిమళ తీర్థమూ 
శ్రీ రాముడు నడచిన క్షేత్రమూ - మణి కంటుడు వెలసిన తీర్థమూ 
శ్రీ రాముడు నడచిన క్షేత్రమూ - మణి కంటుడు వెలసిన తీర్థమూ 
" శబరీ క్షేత్రమూ "

అదిగో ఎరుమేలి - అచటనే మన స్వామి 
అదిగో ఎరుమేలి - అచటనే మన స్వామి 
ఇరుముడితో పాద యాత్ర  తొలి మెట్టుగా భావించే 
ఇచటనే మన స్వామికి మిత్రుడు లభియించే 
ఇచటనే వావరునకు ఉపదేశము గావించే 
" శబరీ క్షేత్రమూ "

అదిగో అలుద మెడ .. అచటనే మహిషి జాడ 
అదిగో అలుద మెడ .. అచటనే మహిషి జాడ 
ఆ రక్కసి భీకరమౌ శబ్దములతో లంకించే 
ఆ రక్కసి భీకరమౌ శబ్దములతో లంకించే
ఇచటనే మణి కంటుడు యుద్దము గావించే 
ఇచటనే మణి కంటుడు యుద్దము గావించే
యిచటనే విల్లుబూని ఆ మహిషిని వధియించె
" శబరీ క్షేత్రమూ "

అదిగో పంపా నది ... అదియే పుణ్య నది 
అదిగో పంపా నది ... అదియే పుణ్య నది
జీవ నదులలోన గొప్ప పావన దశలున్న నదీ 
జీవ నదులలోన గొప్ప పావన దశలున్న నదీ
ఇచటనే కన్నెమూల గణపతి సుబ్రహ్మణ్య 
ఇచటనే కన్నెమూల గణపతి సుబ్రహ్మణ్య
ఇచటనే పాపములను కడిగి పరవశాన్ని అన్ని నిచ్చే 
" శబరీ "

అదిగో శరం గుత్తి - అచటనే శబరి ముక్తి 
అదిగో శరం గుత్తి - అచటనే శబరి ముక్తి 
శ్రీ రాముని దర్శించి మోక్షము పొందిన శబరి 
అదిగో శబరిమల - అదే బంగరు కోవెల
స్వామియే ... శరణం అయ్యప్ప 
అదిగో శబరిమల - అదే బంగరు కోవెల
పరశు రామ క్షేత్రముగా యుగయుగాలు వర్ధిల్లే 
" శబరీ "

 

Sabaree Kshetramu ... Uyyaala paata

It's my another favorite jola paata on Lord Ayyappa. I've heard this song from the lyricist itself. We can heard this song from the album "Shabaree Kshetram". We can see this song writer at Peta thulli by Kanne swamies @ Monda market, Secunderbad on 20th Dec, 2009 URL

వేచి ఉన్న ఉయ్యాల లోన ఊగుచున్నాడు అయ్యప్ప స్వామి 
వేచి ఉన్న ఉయ్యాల లోన ఊగుచున్నాడు అయ్యప్ప స్వామి 
ఉయ్యాల జంపాల ఆనంద డోలల్లో తెలుచున్నాడు అయ్యప్ప స్వామి  
ఉయ్యాల జంపాల ఆనంద డోలల్లో తెలుచున్నాడు అయ్యప్ప స్వామి 
 " వేచి ఉన్న "

ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల 
ఉయ్యాల లూపాల - స్వామికి జంపాల లూపాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల 
ఉయ్యాల లూపాల - స్వామికి జంపాల లూపాల 

చిన్నారి మణికంట బాలుడు 
ఎంతో చల్లాని మనసున్న దేవుడు 
చిన్నారి మణికంట బాలుడు 
ఎంతో చల్లాని మనసున్న దేవుడు 
చెయ్యెత్తి శరణాలు చెప్పితే చాలూ ...
చెయ్యెత్తి శరణాలు చెప్పితే చాలూ ...
ఆపదలో ఉన్న ఆడుకుంటాడు 
"వేచి ఉన్నా... "

దేవతలందరి సాక్షిగా ... ఇక దిక్కులన్ని వీక్షించగా...
దేవతలందరి సాక్షిగా ... ఇక దిక్కులన్ని వీక్షించగా... 
నారద తుంబుర గానాలతోనీ ...  
నారద తుంబుర గానాలతోనీ ... 
ఉయ్యాల జంపాల లూగుచున్నాడు 
"వేచి ఉన్నా ..."

సర్వ లోకాలన్నీ చక్కగా... మా అయ్యప్ప స్వామికి మ్రొక్కగా ...
సర్వ లోకాలన్నీ చక్కగా... మా అయ్యప్ప స్వామికి మ్రొక్కగా ...
పూజలు చేసేటి స్వాముల సన్నిధి.... 
పూజలు చేసేటి స్వాముల సన్నిధి....
జాబిల్లి మాటున చుక్కల వాకిట 
" వేచి ఉన్నా ... "

 

Friday, January 1, 2010

Ayyappa Deeksha Swaamula naamaalu

మనం సాధారణంగా  5వ సారి మాల వేసుకున్న స్వామినో లేక 6వ సారి మాల వేసుకున్న స్వామిని గురు స్వామి అని పిలుస్తాం. కాని పద్దెనిమిదో సారి మాల వేసుకున్న స్వామియె పరి పూర్ణ గురు స్వామి అవుతాడు.
ఎన్నో సారి మాల వేసుకుంటే ఏమని పిలుస్తారో  దిగువ పేర్కొనబడింది.
 
 Year
 Name of the devotee
 Symbol
 1 వ సం.
 కన్నె స్వామి
 బాణం
 2వ సం.
 కత్తి స్వామి
 కత్తి
 3వ సం.
 గంట స్వామి
 గంట
 4వ సం.
 గద స్వామి
 గద
 5వ సం.
 పెరు స్వామి
 విల్లు
 6వ సం.
 జ్యోతి స్వామి
 దీపం
 7వ సం.
 సూర్య స్వామి
 సూర్యుడు
 8వ సం.
 చంద్ర స్వామి
 చంద్రుడు
 9వ సం.
 త్రిశూల స్వామి
 వేలాయుధం
 10వ సం.
 విష్ణు చక్ర స్వామి
 విష్ణు చక్రం
 11వ సం.
 శంఖధర స్వామి
 శంఖం
 12వ సం.
 నాగాభరణ స్వామి
 నాగాభరణం
 13వ సం.
 శ్రీ హరి స్వామి
 మురళి
 14వ సం.
 పద్మ స్వామి
 పద్మము
 15వ సం.
 శ్రీ స్వామి
 త్రిశూలం
 16వ సం.
 రాతి గిరి స్వామి
 రాయి
 17వ సం.
 ఓంకార స్వామి
 క్షరిల్
 18వ సం.
 గురు స్వామి
నారికేళ స్వామి
 కొబ్బరి మొక్క