శరణాలు శరణాలు అయ్యప్పో మా అయ్యప్పా
నీకు శత కోటి దండాలు అయ్యప్పో మా అయ్యప్పా
ఏ తీరు గొలిచేది అయ్యప్పో మా అయ్యప్పా
నిన్ను ఏ మంట పొగిడేది అయ్యప్పో మా అయ్యప్పా
" శరణాలు "
పంపా తీరమందు పంచగిరులల్లో
ఇంపుగ కొలువైన దేవుడవయ్యా
కాంతి మలై నందు జ్యోతి స్వరూపంతో
కలి మాయల భ్రమలు దీర్చినావయ్యా
అభయ హస్తము జూపి అయ్యప్పో మా అయ్యప్పా
మా భయ భ్రన్తులే బాపి నావయ్యో స్వామి అయ్యప్పా
" శరణాలు "
మానవ రూపాన మహిషి ని వధియించి
లోక కల్యాణం జేసినావయ్యా
మాలలు ధరియించి దీక్షలు బూనంగ
మనిషినే దైవంగా మార్చినవయ్యా
శరణమంటే చాలు అయ్యప్పో మా అయ్యప్పా
మమ్ము కరుణతో గాంచేవు అయ్యప్పో మా అయ్యప్పా
" శరణాలు "
నడవలేని వాళ్ళు నీ మాల వేయంగ
నీ కొండకే నడిపిస్తున్నవయ్యా
చూడలేని వాళ్ళు నిన్ను చేరంగానే
దివ్య దర్శనాన్ని ఇస్తున్నవయ్యా
భక్తితో వేడంగా అయ్యప్పో మా అయ్యప్పా
మమ్ము ఆప్తుడవై ఆదుకున్నవో మా అయ్యప్పా
" శరణాలు "
కోరుకున్న వారి కొంగు బంగారమై
కోరిన సిరులిచ్చే రేడువు నీవే
అడిగిన వారికి అష్ట సంపదలిచ్చి
ఆదరించే మా దేవుడు నీవే
నీ దీక్ష బూనంగ అయ్యప్పో మా అయ్యప్పా
మమ్ము రక్షించి మోక్షాన్ని ఇచ్చేవూ మా అయ్యప్పా
" శరణాలు "
No comments:
Post a Comment