Monday, November 30, 2009

Aaadi Sheshaa Anantha Shayana ...

ఆది శేష అనంత శయన
శ్రీనివాసా శ్రీ వేంకటేశ

రఘుకుల తిలకా రఘు రామ చంద్ర
సీతా పతే శ్రీ రామ చంద్ర

యదుకుల భూషణ యశోద నందన
రాధా పతే గోపాల కృష్ణ

పన్నగ భూషణ కైలాస వాసా
గౌరీ పతే శివ శంభో శంకర

రాక్షస మర్దన శ్రీరామ దూతా
అంజని పుత్రా జై జై హనుమా

కాషాయాంబర శ్రీ లక్ష్మి వాస
షిరిడి పతే శ్రీ సాయి నాథా

శ్రీ వేంకటేశా శ్రీ శ్రీనివాసా
శ్రీ తిరుమలేశా శ్రీ వేంకటేశా

వేంకటేశ వేంకటేశ వెంకటేష్ పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం    " ౪ "
వేంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం   " ౪ "

Digu Digu Digu Naaga - Naaganna

దిగు దిగు దిగు నాగ - నాగన్న
దివ్య సుందర నాగో - నాగన్న   " దిగు "

ఇల్లలికి ముగ్గులెట్టి - నాగన్న
ఇంట్లో మల్లెలు జల్లి - నాగన్న
మల్లెల వాసనకు - నాగన్న
కోలాట మాడి పోవా - నాగన్న   " దిగు "

భామలంత కలిసి - నాగన్న
బావి నీళ్ళ కెళితే - నాగన్న
బావిలో ఉన్నావా - నాగన్న
బాల నాగువయ్యో - నాగన్న   " దిగు "

పిల్లాలంత కలిసి - నాగన్న
పుల్లాలేర పోతే - నాగన్న
పుల్లల్లో ఉన్నావా - నాగన్న
పిల్ల నాగువయ్యో - నాగన్న   " దిగు "

స్వాములంత కలిసి - నాగన్న
రేవు నీళ్ళ కెళితే - నాగన్న
రేవులో ఉన్నావా - నాగన్న
కాలా నాగువయ్యో - నాగన్న   " దిగు "

అటు కొండ ఇటు కొండ - నాగన్న
నడుమ నాగుల కొండ - నాగన్న
కొండన ఉన్నావా - నాగన్న
కోడె నాగువయ్యో - నాగన్న   " దిగు "

Sunday, November 29, 2009

Om Haraa Shankaraa - Hara Hara

ఓం హరా శంకరా! హర హర ! ఓం హరా శంకరా !  "౨"
వందనం దిగంబర - వందితా పురంధరా
ఇందు ధర - దురంధరా - హిమాచలాగ్ర మందిరా !    " ఓం హరా "

అంగజ మద సంహార - హర హరా
ఆర్తి ని వాపవ దేరా - హర హరా
గంగాధర ముదమారా - హర హరా
గౌరీ వర రావేరా - హర హరా
అంగతుర తురంధరా - హిమాచలాగ్ర మందిరా    " ఓం హరా "

అంజలినే గైకోరా - హర హరా
ఆశ్రిత జన మందారా - హర హరా
మంజుల భాష సుధీర - హర హరా
మామక దోష నివారా - హర హరా
కుంజ భావ నుదంజ దైత్య భంజనా హరా హరా   " ఓం హరా "

కుండల భూష మహేశా - హర హరా
కుంజర ధనుజ నికాశా - హర హరా
చండిక హృదయ నివాసా - హర హరా
కందిత కాలుని పాషా - హర హరా
మండ లంబు లెల్ల నిండినా పరాత్పరా   " ఓం హరా "

కోరస్: హర హర శంకర శివ శివ శంకర భక్తవ శంకర హర హర ఓం
-- ఓం నమః శివాయ ... ఓం నమః శివాయ ... ఓం నమః శివాయ

SupraBhaatham Swami Suprabhaatham - A song for Lord Ayyappa By Yesudas

సుప్రభాతం ... స్వామి ... సుప్రభాతం
మేలుకోవయ్యా తూరుపు తెల్లవారేను మేలుకో  "౨"
పూజకి వేళాయే స్వామి మేలుకో  " మేలుకో "
మా మొరలాలించి మమ్మేలుకో   " సుప్రభాతం "

అష్ట దిక్పాలులు నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు నువ్వు మేలుకో  " అష్ట "
నా గొంతు పాడింది భూపాలం నిద్ర లేవరా స్వామి నాకోసం ... స్వామి ...
పంపా నది నీ పాదాలు కడుగంగా ఆరాట పడుతోంది లేవయ్యా
మా తొలి సంధ్య పూజలు గొనవయ్యా   " సుప్రభాతం "

కస్తూరి గంధాలు నీకోసమేనయ్య కావల్లలో నెయ్యి నీకోసమే
మా కళ్ళు వేచేను నీకోసం జగమంత వేచేను నీకోసం ... స్వామి
కనులార నీ రూపు దర్శించ కుండిన ఈ కనులు మాకుండి ఫలమేమి
నీ పేరు తలచిన భయమేమి  " మేలుకోవయ్యా "  ...   " సుప్రభాతం "

Monday, November 16, 2009

Maala Dhaaranam - Niyamaala Thoranam

పల్లవి:
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం

చరణం1:
ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్ధత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజర సుఖమై
ఆరు శత్రువుల ఆరడిలో పడి
ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల

మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం

చరణం2:
మా సంగమనాదంలో
ఓం ఓం ఓం హరిహరరూపా అద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
మా సంగమనాదంలో
హరిహరరూపా ద్వైతంలో
నిష్టుర నిగ్రహయోగంలో
మండలపూజా మంత్ర ఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తుల

మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
శరణం అయ్యప్ప ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం

Monday, November 2, 2009

Legu legu legavayya

Ayyappa

Today I heard this song from Raaga website and I liked this song very much. I would love to share the lyrics of this songs with all Ayyappan Devotees.


This song was composed by Rayancha for the album "Ayyappa Maala" which was released in 1998.


లెగు లెగు లెగవయ్య అయ్యప్ప

లేవయ్యా మణికంఠ అయ్యప్ప " లెగు "


నీకు నలుగు పెట్టి అయ్యప్ప

స్నానాలు చేయించ అయ్యప్ప

హరి హరులు వచ్చేరు అయ్యప్ప

నిద్ర లేవవయ్య అయ్యప్ప " లెగు "


ముద్దు ముచ్చతాడి అయ్యప్ప

ముస్తాబు చేయించ అయ్యప్ప

నిను పెంచిన తండ్రి అయ్యప్ప

పందల రాజొచ్చే అయ్యప్ప " లెగు "


పుష్పాలతో నిన్ను అయ్యప్పAyyappa

పూజించి సేవించ అయ్యప్ప

వన మెల్ల వచ్చెను అయ్యప్ప

ఓ తండ్రి లేవయ్యా అయ్యప్ప " లెగు "


మంగళ వాద్యాల అయ్యప్ప

మేలుకొలుపు పాడ అయ్యప్ప

నారద తుంబురులు అయ్యప్ప

నీ ముందు నిలిచేరు అయ్యప్ప " లెగు "


శరణంటూ నిను చేరి అయ్యప్ప

కరుణించ మని కోరి అయ్యప్ప

స్వాములంత వచ్చే అయ్యప్ప

మణికంఠ లేవయ్యా అయ్యప్ప " లెగు "