Monday, November 30, 2009

Digu Digu Digu Naaga - Naaganna

దిగు దిగు దిగు నాగ - నాగన్న
దివ్య సుందర నాగో - నాగన్న   " దిగు "

ఇల్లలికి ముగ్గులెట్టి - నాగన్న
ఇంట్లో మల్లెలు జల్లి - నాగన్న
మల్లెల వాసనకు - నాగన్న
కోలాట మాడి పోవా - నాగన్న   " దిగు "

భామలంత కలిసి - నాగన్న
బావి నీళ్ళ కెళితే - నాగన్న
బావిలో ఉన్నావా - నాగన్న
బాల నాగువయ్యో - నాగన్న   " దిగు "

పిల్లాలంత కలిసి - నాగన్న
పుల్లాలేర పోతే - నాగన్న
పుల్లల్లో ఉన్నావా - నాగన్న
పిల్ల నాగువయ్యో - నాగన్న   " దిగు "

స్వాములంత కలిసి - నాగన్న
రేవు నీళ్ళ కెళితే - నాగన్న
రేవులో ఉన్నావా - నాగన్న
కాలా నాగువయ్యో - నాగన్న   " దిగు "

అటు కొండ ఇటు కొండ - నాగన్న
నడుమ నాగుల కొండ - నాగన్న
కొండన ఉన్నావా - నాగన్న
కోడె నాగువయ్యో - నాగన్న   " దిగు "

No comments: