సుప్రభాతం ... స్వామి ... సుప్రభాతం
మేలుకోవయ్యా తూరుపు తెల్లవారేను మేలుకో "౨"
పూజకి వేళాయే స్వామి మేలుకో " మేలుకో "
మా మొరలాలించి మమ్మేలుకో " సుప్రభాతం "
అష్ట దిక్పాలులు నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు నువ్వు మేలుకో " అష్ట "
నా గొంతు పాడింది భూపాలం నిద్ర లేవరా స్వామి నాకోసం ... స్వామి ...
పంపా నది నీ పాదాలు కడుగంగా ఆరాట పడుతోంది లేవయ్యా
మా తొలి సంధ్య పూజలు గొనవయ్యా " సుప్రభాతం "
కస్తూరి గంధాలు నీకోసమేనయ్య కావల్లలో నెయ్యి నీకోసమే
మా కళ్ళు వేచేను నీకోసం జగమంత వేచేను నీకోసం ... స్వామి
కనులార నీ రూపు దర్శించ కుండిన ఈ కనులు మాకుండి ఫలమేమి
నీ పేరు తలచిన భయమేమి " మేలుకోవయ్యా " ... " సుప్రభాతం "
No comments:
Post a Comment