నెత్తి మీద ఇరుముడి తోని మా స్వామీ అయ్యప్పా
వస్తున్నాం నీ శబరికి మా శరణం అయ్యప్పా
శరణు ఘోష జేసుకుంటారో మా శబరి అయ్యప్ప
కరిమలకు బయలుదేరినం మా ఎరుమేలి అయ్యప్పా
నెత్తి మీద ఇరుముడితో వస్తున్నం నీ శబరికి
శరణు ఘోష జేసుకుంట కరిమల బైలెల్లినాము
కన్నె స్వాములస్తున్నామో మా కరిమల అయ్యప్పా
కాలి నడకనొస్తున్నామో మా తండ్రి అయ్యప్పా
చెట్టు పుట్ట దాటుకుంటూ మా స్వామీ మణికంట
కొట్టాయం జేరినమయ్యో మా తండ్రి మణికంట
ఎరుమేలి జేరుకొని మా వీర మణికంట
ఎగిరినాము పేటతుల్లిలో మా పందల మణికంట
చెట్టు పుట్ట దాటుకుంటు కొట్టాయం జేరినాము
ఎరుమేలి జేరుకొని ఎగిరినాము పేటతుల్లి
వావరున్ని దర్శించినం మా స్వామీ మణికంట
వందనాలు జేసినమయ్య మా తండ్రి మణికంట
పేట తుళ్ళి ఆటలు ఆడి మా వీర మణికంట
పెద్ద పాదం బాట వట్టినం మా పందల మణికంట
వావరున్ని దర్శించి వందనాలు జేసినాము
పేట తుళ్ళి ఆటలాడి పెద్ద పాదం వట్టినాము
అలుదానది జేరినమయ్యో మా స్వామీ మణికంట
స్నానమాచరిన్చినమయ్యో మా తండ్రి మణికంట
రాళ్ళు రెండు తీసుకొని మా వీర మణికంట
కల్లిడం కుండ్రుల వేసినం మా కరిమల మణికంట
అలుదానది జేరినాము స్నానమాచరించినము
రాళ్ళు రెండు తీసుకొని కల్లిడం కుండ్రుల వేసి
పంబ లోన మునిగినమయ్యో మా స్వామీ మణికంట
విఘ్నేషుని మొక్కినమయ్యో మా తండ్రి మణికంట
పద్దెనిమిది నీ మెట్లెక్కి మా వీర మణికంట
నిన్ను జూచి తరియించినమో మకర జ్యోతి మణికంట
పంబ లోన మునిగినాము విఘ్నేషుని మొక్కినమూ
పద్దెనిమిది మెట్లెక్కి నిన్ను జూచి తరించినం
శరణం శరణం అనుకుంటూ మా స్వామీ అయ్యప్పా
నీ శబరికి వస్తున్నాము మా శరణం అయ్యప్పా
నెత్తి మీద ఇరుముడి తోని మా స్వామి అయ్యప్పా
వస్తున్నాం నీ శబరికి మా శరణం అయ్యప్పా
శరణు ఘోష జేసుకుంటను మా స్వామీ అయ్యప్పా
నీ శబరికి జేరినమయ్య మా శరణం అయ్యప్పా