Monday, December 26, 2011

Saranamayya Saranamayya from Pamba vaasa Ayyappa Album

శరణమయ్య శరణమయ్య స్వామీ నీకు 
శరణం అయ్యప్ప తండ్రి నీకు 
దండమయ్య దండమయ్య స్వామీ నీకు 
ధర్మశాస్త అయ్యప్ప దేవ నీకు 

నీ మాల వేస్తె పాపాలు తొలుగుతాయట
దీక్ష బూనంగా మోక్షాలు కలుగుతాయట  
నిష్ఠ నియమాలు మాలోన నిండుతాయట 
భక్తీ శ్రద్ధ లేమో మాలోన పెరుగుతాయట 
కోపాలు తాపాలు మోసాలు ద్వేషాలు 
మమ్ము వీడి పోవునంటరో...

పొద్దు పొడుపు కంటే ముద్దుగున్న బాల వీరుడౌ
ఆ చందురుని కంటే వెలిగి పోయే శూరుడౌ
కోటి రూపాన దినమంతా మెరిసిపోతవు
మా చీకటైన బతుకులల్లో వెలుగు వౌతవు 
నిన్ను జూడ వెయ్యి నొక్క కన్నులైన జాల వయ్యా 
చిన్ని మణి కంట దేవుడా ...

ధర్మశాస్తవై ధర్మాన్ని నిలుపుతున్నవు
లోక శాస్తవై లోకాన్ని గాయుచున్నావు  
స్వర్ణ మందిరాన సత్యంగా నిలిచి ఉన్నవు
వచ్చి పోయేటి భక్తులకు వరములిస్తావు 
ఎంత గొప్ప దేవుడవు శాంత రూప అయ్యప్ప 
కొత్తపెళ్లి దేవ దేవుడా ...







No comments: