పంబా వాస అయ్యప్పా - మా పాపాలు కడిగే పావన రూప - పంబా వాస అయ్యప్పా
కరిమల వాస అయ్యప్పా - మా కష్టాలు బాపే కరుణాల వాలా - కరిమల వాస అయ్యప్పా
శరణమప్ప శరణమప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప
శరణమప్ప శరణమప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప
పెంచుకున్న తల్లే నాటకమాడి - పులి పాలు దెమ్మని అడవికి వంపితే

పులి మీద గూసోని పువ్వోలె నవ్వుతు - ఇల్లు జేరినావు మెల్లంగ మణికంట

వీర విక్రముడు నీవేనయ్యా - వీర దిగ్గజుడు నీవేనయ్యా

బాల రూపములోన మమ్మేలుతున్న భగవంతుడవు నీవేనయ్యా
"పంబా వాస "
మహిమలెన్నో ఉన్న దేవుడు నీవంట - మహిషిని గూల్చిన ఘనుడే నీవంట

మోహంలో ఉన్నట్టి కావుర మనచిన జ్ఞానవంతుడవు నీవే మణి కంట

ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించ ధర్మశాస్త గా వెలిసిన వయ్యా

పందల రాజ్యాన కొలువై మమ్ముల పాలించుతున్నావు అయ్యప్ప తండ్రి
"పంబా వాస "
శరణమప్ప శరణమప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప
శరణమప్ప శరణమప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప
పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు

పాలాభిషేకం నేయ్యాభిషేకం పన్నీరు గందాభిశేకాలు నీకు

గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా నీ శరణు ఘోషను జేస్తూ

అభిషేక ప్రియుడు నీవేనని అభిషేకాలు జేత్తున్నమయ్య
"పంబా వాస "
No comments:
Post a Comment