Monday, December 26, 2011

Netti meeda Irumudithoni from Pambaa Vaasa Ayyappaa Album

నెత్తి మీద ఇరుముడి తోని మా స్వామీ అయ్యప్పా 
వస్తున్నాం నీ శబరికి మా శరణం అయ్యప్పా 
శరణు ఘోష జేసుకుంటారో మా శబరి అయ్యప్ప 
కరిమలకు బయలుదేరినం మా ఎరుమేలి అయ్యప్పా 

నెత్తి మీద ఇరుముడితో వస్తున్నం నీ శబరికి 
శరణు ఘోష జేసుకుంట కరిమల బైలెల్లినాము

కన్నె స్వాములస్తున్నామో మా కరిమల అయ్యప్పా 
కాలి నడకనొస్తున్నామో మా తండ్రి అయ్యప్పా 


చెట్టు పుట్ట దాటుకుంటూ మా స్వామీ మణికంట 
కొట్టాయం జేరినమయ్యో మా తండ్రి మణికంట 
ఎరుమేలి జేరుకొని మా వీర మణికంట 
ఎగిరినాము పేటతుల్లిలో మా పందల మణికంట 

చెట్టు పుట్ట దాటుకుంటు  కొట్టాయం జేరినాము 
ఎరుమేలి జేరుకొని ఎగిరినాము పేటతుల్లి


వావరున్ని దర్శించినం మా స్వామీ  మణికంట 
వందనాలు జేసినమయ్య  మా తండ్రి మణికంట 
పేట తుళ్ళి ఆటలు ఆడి మా వీర మణికంట 
పెద్ద పాదం బాట వట్టినం మా పందల మణికంట 

వావరున్ని దర్శించి వందనాలు జేసినాము 
 పేట తుళ్ళి ఆటలాడి పెద్ద పాదం వట్టినాము 


అలుదానది జేరినమయ్యో మా స్వామీ  మణికంట 
స్నానమాచరిన్చినమయ్యో  మా తండ్రి మణికంట 
రాళ్ళు రెండు తీసుకొని మా వీర మణికంట 
కల్లిడం కుండ్రుల వేసినం మా కరిమల మణికంట 

అలుదానది జేరినాము స్నానమాచరించినము
రాళ్ళు రెండు తీసుకొని కల్లిడం కుండ్రుల వేసి


పంబ లోన మునిగినమయ్యో  మా స్వామీ  మణికంట
విఘ్నేషుని మొక్కినమయ్యో మా తండ్రి మణికంట 
పద్దెనిమిది నీ మెట్లెక్కి మా వీర మణికంట 
నిన్ను జూచి తరియించినమో మకర జ్యోతి మణికంట 

పంబ లోన మునిగినాము విఘ్నేషుని మొక్కినమూ 
పద్దెనిమిది మెట్లెక్కి నిన్ను జూచి తరించినం 



శరణం శరణం అనుకుంటూ మా స్వామీ అయ్యప్పా 
నీ శబరికి వస్తున్నాము మా శరణం అయ్యప్పా 
నెత్తి మీద ఇరుముడి తోని మా స్వామి అయ్యప్పా 
వస్తున్నాం నీ శబరికి మా శరణం అయ్యప్పా 
శరణు ఘోష జేసుకుంటను మా స్వామీ అయ్యప్పా 
నీ శబరికి జేరినమయ్య మా శరణం అయ్యప్పా

No comments: