బంగారు ఊయల వేచి చూసేనులే
నా చిన్ని మణికంటుడు రాడేమని
నింగిలో వెన్నెలమ్మ వెల వెల వెల బోయెనే
నను చేరే ఆ వెలుగు రాలేదని
తారలన్ని రాలేను నేల దారి చేరెను
చల్ల గాలి ఆగేను పూలు చిన్న బోయెను
నా స్వామి వచ్చి నిదుర పోలేదని " బంగారు "
పంచామృతాల జల్లుల్లో
స్వామి అలసి సొలసి పోయావయ్య
నేయ్యాభిషేకాలతో స్వామి నిదుర మరచి పోయావయ్య " పంచామృతాల "
కోయిలమ్మ వేచేను నీకు జోల పాడగా
నీలి నింగి నిలిచెను ఏమి దారి తోచక
గల గల పారేటి సెలయేరు ఆగగా
గల గల పారేటి సెలయేరు ఆగగా " బంగారు "
వెన్నెలమ్మ వెలిగి పోయెను స్వామి నీవు కంట పడ్డావని
తారలన్ని తీరం చేరెను స్వామి పందిరి నీకు వెయ్యాలని " వెన్నెలమ్మ "
కోయిలమ్మ రాగము నీకు లాలి పాటగా
నీలి నింగి సాగెగా నీకు వాన గొడుగుగా
పారే సెలయేరు చల్ల గాలి పంపగా
బంగారు ఊయల మురిసి ఊగేనులే
నా స్వామి నిదురించే వేళాయెనే
పూలన్నీ పరిమళాలు వెదజల్లెనే
నా స్వామి నిదురించే వేళయెనే
నా స్వామి నిదురించే వేళయెనే
నా స్వామి నిదురించే వేళయెనే జో ... లాలీ జో ...
జో ... లాలీ జో ...
జో ... లాలీ జో ...
No comments:
Post a Comment