తల్లివి నీవే తండ్రివి నీవే మణికంట
మా తోడువు నీవే నీడవు నీవే మణికంట
గురువు నీవే నేస్తం నీవే మణికంట
శబరి గిరిపై వెలిసిన కలియుగ దైవం నీవంటా ...
సకలము నీవే సర్వము నీవే
మము పాలించే మా దైవము నీవే
హరి హర పుత్రా ఆపద్భాంధవ స్వామి శరణమయా " తల్లివి "
భవ బంధాలను మరచి
ప్రతి నిమిషం నిన్నే తలచి " భవ "
చన్నీటి స్నానం చేసి కర్పూర హారతులిచ్చి
క్షణమైనా మరవక నిన్నే నీ సేవే చేసే మయ్యా
ప్రతి నిత్యం మా మదిలో నీ ధ్యానం చేసామయ్య
నీ ధ్యానం చేసామయ్య
ఆపద్భాంధవ నీవే రక్షా మణికంట
భువి పై వెలిసిన కలియుగ దైవం నీ వంట " ఆపద్భాంధవ " " తల్లివి "
కొబ్బరాకుల పందిరి వేసి
కలువల తోరణమే కట్టి " కొబ్బరాకుల "
పన్నీరు గంధం కలిపి నీ నుదుటన తిలకం దిద్ది
తులసి మాల నీ మేడలో వేసి అలంకారమే చేసామయ్య
మా ఆత్మను జ్యోతిగా చేసి నీ ముందే నిలిపామయ్య
నీ ముందే నిలిపామయ్య
దేహం నీవే ప్రాణం నీవే మణికంట
మము చల్లగా చూసే స్వామివి నీవే మణికంట
మా " దేహం " " తల్లివి "
No comments:
Post a Comment