Friday, December 4, 2009

chilakammaa ... chilakammaa - Ayyappa Abhayam

చిలకమ్మా .. చిలకమ్మా
వన్నె చిన్నెలన్ని కులుకు వని లోనా
నీ వైనాలు దేని కోసమూ
కోయిలమ్మ .. కోయిలమ్మా 
మావి చిగురు ఊయలూగు వేళ లోన
ఈ మౌనాలు  ఎందుకోసమో
మాజా మాతా ... మంజ మాతా ...
ఎదురు చూపుకు తుది లేదా   " మంజ మాతా "
అమ్మమ్మా  ... నీ దయ వలెనే గా
ఆ అయ్యప్ప దర్శనం మాకు కలిగేను     " చిలకమ్మా "

అయ్యప్ప స్వామిని చేరు వరకు
ఆచరిన్చేవు ఘోర తపము
పెళ్లి కాని కన్నె పడుచులా ....
వాడి పోయే ముద్దు మోము
మట్టి మాసే కన్నె మేను
మసి కాచే అడవి వెన్నెలా ...
రాళ్ళల్లో కర్పూరం ... కళ్ళలో సిదూరం ...
మనసులో పూమాల మెరయునా మెడ లోనా
అమ్మమ్మా .. నీ దయ వలనేగా
ఆ అయ్యప్ప దర్శనం మాకు కలిగేను      " చిలకమ్మా "

కనుల కారే కాటుక రేఖ
కళలు తీరే నీ సిగ పాయ
గడిచేనో యుగము తపములో
అలలు రేగే కాంక్షల తోనా
అలపులూరే ఆశతోనా
శీలా వోలె కాలం సాగునో
మాలిగై పురత్తమ్మ ... మాయనీ కుంకుమ
అండగా నీ ప్రేమ ... చాలునా ఈ జన్మ

అమ్మమ్మా .. నీ దయ వలనేగా
ఆ అయ్యప్ప దర్శనం మాకు కలిగేను      " చిలకమ్మా "

 

No comments: