Thursday, December 31, 2009

Bangaaru ooyala - Vol-II Title Song : Ayyappa Jola Paata

జోల పాట పాడనా బంగారు నా స్వామి
లాలి పాట పాడనా మమ్మేలు మా తండ్రి
జోల పాట పాడనా బంగారు నా స్వామి
లాలి పాట పాడనా మమ్మేలు మా తండ్రి
జోల పాట పాడనా బంగారు నా స్వామి
లాలి పాట పాడనా మమ్మేలు మా తండ్రి

ఎంత ముద్దుగున్నావయ్యా ఏమిటీ గారడీ
నిద్దరే పోనంటావు ఎందుకయ్యా అల్లరి
స్వామి నా స్వామీ
స్వామి నా స్వామీ
తెల్లవారక ముందే స్వామి లేమ్మంటారు
గడియైనా నిదరోర స్వామి
ఒక్క గడియైనా నిదురోర స్వామి
           " జోల పాట "

ఓ చిలకమ్మా నీవైన చెప్పవే
నా మాట వినను అంటూ మారాము చేస్తున్నాడే    " ఓ చిలకమ్మా "
నీ చిట్టి పొట్టి పలుకులతో
చిట్టి చిలకమ్మ కథ చెప్పవే
నీ ముచ్చటైన మాటలతో
నా స్వామి నిదురను పుచ్చవే
స్వామి నా స్వామీ
స్వామి నా స్వామీ
             " ఎంత ముద్దుగున్నావయ్య "     ...  " జోల పాట "

ఈ చిలకమ్మ కథలొద్దంటావు
నా కథలు వింటా నంటూ నిద్ర పోతానంటు
కలవర కలవర పెడుతున్టావు
నన్ను కథలు చెప్పమంటావు
స్వామి  నా స్వామీ ...
స్వామి  నా స్వామీ ...
                   " ఈ చిలకమ్మ "
చందమామ కథలు చెప్పనా
నా చంద్రుడు ముందుండగా
రాజుల కథలే చెప్పనా
రాజాది రాజువు నువ్వుండగా

స్వామి  నా స్వామీ ...
స్వామి  నా స్వామీ ...
నా భక్తి  భావనను కొమ్మకు బంగారు ఊయల కట్టాను
ఈ దాసాను దాసుడను నీఎకి సేవలు చేస్తాను   " నా భక్తి భావనను "
                    తెల్లవారక ముందే స్వామి లేమ్మంటారు ...........................


జోల పాట పాడనా .. బంగారు నా స్వామి
లాలి పాట పాడనా .. మమ్మేలు మా తండ్రి
వెన్నెలమ్మ సాగుతున్నది
వేకువమ్మ వేచి ఉన్నది
చుక్కలన్నీ చూస్తూ ఉన్నవి
చల్ల గాలి వీస్తూ ఉన్నది
స్వామి  నా స్వామీ ...
స్వామి  నా స్వామీ ...

అభిషేకానికి వేలవుతుంది
నిద్దర పోరా స్వామీ
నిద్దుర పోరా స్వామీ
జోలాలి జోలా స్వామి జోలాలిజో
అయ్యప్పా జోలాలి జోలా స్వామి జోలాలిజో
జోలాలి జోలా స్వామి జోలాలిజో 
మణికంట జోలాలి జోలా స్వామి జోలాలిజో
జోలాలిజో  ... జోలాలిజో  ...



No comments: