కంఠ కంఠ మణికంఠ మంగళ రూపం నీదంట
అంతట ఉన్నా అనుచిత్తా భక్తుల బ్రోచే భగవంత "కంఠ"
పంపా సన్నిధి గురు దేవా శూళాయుధకర శివ బాల
పరమ దయాకర పందల రాజా పరమార్థం విడు భవ శీల " కంఠ "
అడవులలో నీ పయనం సుజనులకే తేజమయం
ఉదయమునే స్నాన జపం ఓజో వృద్ధికి శ్రీకారం
భూ శయనం వ్రాత నియమం చేయునులే మనసు దృడం
శాంతమనే సర్వ గుణం సత్యాన్వేషణ కాధారం
మది నెలకొను ధైర్య స్థైర్యం మహిజనులకు ఒసగును విజయం
హరి హర సుత అయ్యప్ప ధ్యానం శ్రమ గమ యుత యోగ మార్గం
అయ్యా ... అయ్యప్పా ... కంఠ ... మణికంఠ " ౨ " " కంఠ "
మనుజ కులం ఒకటి యని మతములన్నీ మంచివని
పరహితమే పరమమని సత్యము చాటును నీ యాత్ర
ఈ దివిలో మనుజునిదే ఉత్తమమౌ జన్మ అని
జన్మ కిదే ధన్యతని చేయగ వలెను ఈ యాత్ర
గురు స్వాముల కారునే శరణం కలి కల్మష హరమే శరణం
నిజ భక్తికి బీజమే శరణం .... నిఖిలాకిల మోక్ష ప్రదాయం
అయ్యా ... అయ్యప్పా ... కంఠ ... మణికంఠ " ౨ " " కంఠ " " పంపా "
No comments:
Post a Comment