గణపతి ఓం గణపతి గణపతి మా గణపతి
నిన్ను నమ్మి కొలచినాము నీవేగా అధిపతి
నీవే మా కధిపతి " గణపతి "
గణ నాథా కరుణించు కష్టాలే కడతేర్చు
నిను వేడే భక్తులము శుభమనుచు దీవించు
గుణ గుణ రావయ్య మా బొజ్జ గణపయ్య
ముందుగ నీకే మా పూజ లందు కోవయ్య " గుణ " " గణపతి "
ముల్లోకాలకు నీవేగా మూలము
నిను పూజిస్తేనే విఘ్నాలు దూరము
వెలగ పండ్లు కుడుములు అధికం
నేతి లడ్డూలు ఉండ్రాలు ఇవిగో " ముల్లోకాలకు "
ధన ధన రావయ్య ఎలుకనేక్కి రావయ్య
పండ్లు ఫలహారం స్వీకరించు గణపయ్య " గుణ గుణ " " గణపతి "
పంబా తీరాన వెలిసిన ఓ దేవా
కలియుగాన కష్టాలు తీర్చగా రావా!
సిద్ది బుద్దినే కలిగించే దేవా
లాభము శుబహమును కూర్చగా రావా ! " పంబా"
పార్వతమ్మ ముద్దు బిడ్డ కదలి నువ్వు రావయ్య
ఇదిగో కర్పూర హారతందు కోవయ్య
" గుణ గుణ " " గణపతి "
No comments:
Post a Comment