రా కదలి రా ... నాగరాజా కదలిరా
రా కదలి రా ... నాగరాజా కదలిరా
రా కదలి రా ... నాగరాజా కదలిరా
రా కదలి రా ... నాగరాజా కదలిరా
పాల సంద్రం వీడి నువ్వు కదలిరా
వెండి కొండలు దాటి నువ్వు కదలిరా
పాల సంద్రం వీడి నువ్వు కదలిరా
వెండి కొండలు దాటి నువ్వు కదలిరా
" రా కదలి రా "
శేషాద్రి కొండగా వెలుగొందినావు
శ్రీశైల శిఖరానికే దారి నీవు
శేషాద్రి కొండగా వెలుగొందినావు
శ్రీశైల శిఖరానికే దారి నీవు
చిరు నగవులు ఒలికే శ్రీ సిరి హరికే
పాల సంద్రాన పాన్పు వైనావు
ముల్లోకములేలే ముక్కంటి మెడలో
బంగారు హారమై మెరిసి పోయావు
ఆది శక్తి అంశవై నీవు పుడమి లోనా శక్తివై
ఆది శక్తి అంశవై నీవు పుడమి లోనా శక్తివై
" రా కదలి రా "
రేపల్లె మడుగులో కన్నయ్య అడుగుతో
తలను వేదిక చేసి నాట్య మాడిన్చావు
లోకాల కధిపతి పంబా గణపతికి
వడ్డానమై నీవు వన్నె చేకూర్చావు
పంచమి రోజున పాలను మే పోసాము
నాగ దేవతగా నమ్మి నిను కొలిచాము
సూర్య చంద్రులు కన్నులుగా నువ్వు ధరనినే మోయంగా రా
సూర్య చంద్రులు కన్నులుగా నువ్వు ధరనినే మోయంగా రా
" రా కదలి రా "
No comments:
Post a Comment